Home

»

Latest News

భ‌ల్లాల దేవుడికి బ‌ర్త్ డే విషెస్

Dec 14, 2018 9:22AM

 

తాత మూవీ మొఘ‌ల్, తండ్రి స్టార్ ప్రొడ్యూస‌ర్, బాబాయి స్టార్ హీరో అయినా త‌ను మాత్రం స్టార్ లా ఎప్పుడూ ఫీల‌వ‌లేదు.  త‌న‌కంటూ, త‌న‌దంటూ స‌ప‌రేట్ మార్క్ ఉండాల‌నుకున్నాడు. అందుకే క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో కాకుండా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ  విభిన్న చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారాడు రానా ద‌గ్గుబాటి. దీనికి ఆయ‌న చేసిన చిత్రాలే నిలువెత్తు నిద‌ర్శ‌నం. లీడ‌ర్ ద‌గ్గ‌ర నుంచి ప్ర‌జంట్ చేస్తోన్న ఎన్టీఆర్ చిత్రం వ‌ర‌కు ప్ర‌తి సినిమా త‌నేంటో నిరూపించిందే.

రానా...టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్. అంత‌ర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ` బాహుబ‌లి`లో భ‌ల్లాల దేవుడుగా మెప్పించిన `ఆజానుబాహుడు` . క‌థానాయ‌కుడుగానే కాకుండా ప్ర‌తి నాయ‌కుడిగా కూడా త‌న న‌ట‌నా చాతుర్యాన్ని ప్ర‌ద‌ర్శించి అపూర్వ కీర్తి గ‌డించాడు.

ఇండ‌స్ట్రీలో కాలు మోపిన తొలి నాళ్ల‌లోనే బాలీవుడ్ లో కూడా న‌టించిన ఘ‌నత రానా సొంతం. మొద‌టి చిత్రం `లీడ‌ర్` తోనే రానా చాలా సెటిల్డ్ గా న‌టించి సినీ ప్ర‌పంచాన్ని ఆక‌ట్టుకున్నాడు. ఆ త‌ర్వాత క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్ ` చిత్రం ద్వారా త‌న న‌ట‌నా ప్ర‌తిభ ఏంటో మ‌రో మారు నిరూపించుకున్నాడు. ఇక జ‌క్క‌న్న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `బాహుబ‌లి` లో భ‌ల్లాల‌దేవ పాత్ర‌లో న‌టించి మెప్పించి ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటీవ‌ల రానా న‌టించిన `నేనే రాజు నేనే మంత్రి` చిత్రంలో త‌న అద్భుత‌మైన న‌ట‌నతో మ‌రోమారు హీరోగా ఇటు ప్రేక్ష‌కుల నుంచి అటు విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుని రానా అంటే ఆల్ రౌండ‌ర్ అనిపించుకున్నాడు.  అలాగే ఘాజీ చిత్రంతో విభిన్న మైన స్క్రిప్ట్స్ ఎన్నుకుంటూ  విభిన్న చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారిపోయాడు.

 

క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌ను కాకుండా క‌థా బ‌ల‌మున్న చిత్రాల‌ను ఎంచుకుంటూ త‌న‌లాంటి ఎంతో మంది సినీ వార‌సుల‌కు ఇనిస్పిరేష‌న్ గా నిలిచాడు రానా.  ఇక తాజాగా ఎన్టీఆర్ చిత్రంలో చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లో మెర‌వ‌బోతున్నారు రానా. ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. ఇలా తెలుగు, త‌మిళం, హిందీ చిత్రాల‌లో న‌టిస్తూ బిజీ బిజీగా ఉంటూనే మ‌రోవైపు టీవీ షోస్ లు కూడా చేస్తున్నాడు రానా.  ఇలా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపుని, పేరుని తెచ్చుకుని ముందుకు వెళ్తోన్న భ‌ల్లాల దేవుడు ఈ నెల 14న పుట్టిన రోజు జ‌రుపుకోనున్న సంద‌ర్భంగా ఆయ‌న‌కు బ‌ర్త్ డే విసెష్ తెలియ‌జేస్తోంది తెలుగు వ‌న్ డాట్ కామ్.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com