గుంటూరు కారం.. థియేటర్లు తగలబడిపోతాయి!
on Oct 5, 2023
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ 'గుంటూరు కారం'. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధా కృష్ణ(చినబాబు) నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ సింగల్ ని ఈ దసరా లోపు విడుదల చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే రెండు, మూడు పాటల రికార్డింగ్ పూర్తయిందని, పాటలు అదిరిపోయాయని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తాజాగా యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ సైతం 'గుంటూరు కారం' సాంగ్ గురించి అదిరిపోయే న్యూస్ చెప్పాడు.
చినబాబు కుమార్తె హారిక సూర్యదేవర, అక్టోబర్ 6 విడుదల కానున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'మ్యాడ్'తో నిర్మాతగా పరిచయమవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం సాయంత్రం జరగగా.. సిద్ధు గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. మహేష్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ చెప్పాడు. "చినబాబు గారు ఈరోజు మధ్యాహ్నం ఒక విషయం చెప్పారు. అది చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు. ఇవాళ గుంటూరు కారం సాంగ్ షూట్ నుంచి వచ్చారంట. చినబాబు గారి గొంతులో నేను అంత ఎక్సైట్ మెంట్ చాలారోజుల తర్వాత విన్నాను. సాంగ్ సూపర్ వచ్చింది, థియేటర్లు తగలబడిపోతాయి అన్నారాయన" అని సిద్ధు చెప్పుకొచ్చాడు. సిద్ధు మాటలతో ఆ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
