డార్క్ థ్రిల్లర్ 'జి.టి.ఎ' మొదలైంది
on Feb 28, 2021

అశ్వద్ధామ ప్రొడక్షన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి బైరి దీపక్ సిద్ధాంత్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, డాక్టర్ బి.సుశీల నిర్మిస్తున్న డార్క్ థ్రిల్లర్ 'జి.టి.ఎ' (గన్స్-ట్రాన్స్-యాక్షన్). చైతన్యకృష్ణ, హీనా రాయ్, సుదర్శన్, శరత్ చంద్ర, రాఖీ, శ్రీకాంత్ అయ్యంగార్, రూపాలక్ష్మి కుమరన్ ముఖ్య తారాగణంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 28 ఫిబ్రవరి ఉదయం హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా మొదలైంది.
చైతన్యకృష్ణ, సుదర్శన్, రాకీలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ క్లాప్ కొట్టగా, 'బజార్ రౌడీ' నిర్మాత సందిరెడ్డి శ్రీనివాసరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో నిర్మాత డాక్టర్ సుశీల దర్శకుడు బైరి దీపక్ సిద్ధాంత్, చైతన్యకృష్ణ, సుదర్శన్, రాకీ, శరత్ చంద్ర, రూపాలక్ష్మి కుమరన్, హీరోయిన్ హీనా రాయ్, సంగీత దర్శకుడు మార్క్ కె.రాబిన్, కెమెరామెన్ కె.వి.ప్రసాద్, ఎడిటర్ గ్యారీ, ప్రముఖ విద్యావేత్త పి బి.వి.సుబ్బయ్య పాల్గొన్నారు.
టాలీవుడ్ లో ఇప్పటివరకు తెరకెక్కని అత్యంత వైవిధ్యమైన కథాoశంతో డార్క్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, అందుకు అవసరమైన అద్భుతమైన టీమ్ సెట్ అయ్యిందని దర్శకనిర్మాతలు తెలిపారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



