Home

»

Latest News

మాస్ రాజా మ‌రో సినిమా!!

May 4, 2019 11:18AM

 

`రాజా ది గ్రేట్ ` స‌క్సెస్ త‌ర్వాత వ‌రుస చిత్రాల‌తో బిజీ బిజీగా ఉన్నాడు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. ప్ర‌స్తుతం విఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో `డిస్కోరాజా` చిత్రంలో న‌టిస్తున్నాడు .ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే మాస్ రాజా మ‌రో సినిమాకు ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది.  ర‌వితేజ తో `డాన్ శీను`, బ‌లుపు వంటి స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌ను డైర‌క్ట్ చేసాడు ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని. అయితే వీరిద్ద‌ర కాంబినేష‌న్లో మ‌రో సినిమా తెర‌కెక్క‌నుంద‌ట‌. ఇటీవ‌ల గోపిచంద్ వినిపించిన క‌థ ర‌వితేజ‌కు న‌చ్చ‌డంతో వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం అందుతోంది. అయితే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా ఆఖ‌రి ద‌శ‌లో ఉన్నాయ‌ట‌. ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంద‌ట‌. త్వ‌ర‌లో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com