Home

»

Latest News

`మ‌హానటి` కి ద‌క్కిన మ‌రో గౌర‌వం!!

May 4, 2019 12:54PM

 

మ‌హాన‌టి సావిత్రి  లైఫ్ హిస్ట‌రీ ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం `మ‌హాన‌టి`.  ఈ చిత్రం అటు ప్రేక్ష‌కుల ఇటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుని  అద్భుత‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకుంది. వైజ‌యంతి మూవీస్ బేన‌ర్ లో నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇక సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టించింది అన‌డంకంటే జీవించింది అంటే బాగుంటేదేమో. వెండితెర‌పై మాయ చేసిన `మ‌హాన‌టి` బుల్లితెర పై కూడా త‌న స‌త్తాను చాటింది. తాజా గా ఈ సినిమాకు మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. 22వ షాంఘై ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలి ఫెస్టివ‌ల్ (ఎస్ఐఎఫ్ఎఫ్‌) కు మ‌హాన‌టి చిత్రం సెల‌క్ట్ అయింది. దీనికి ఎంపికైన తొలి ఇండియ‌న్ సినిమాగా మ‌హాన‌టి రికార్డ్ ల‌కెక్కింది. దీంతో మ‌హాన‌టి టీమ్ కు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com