
హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న చిత్రం `వాల్మీకి`. కోలీవుడ్ లో సక్సెస్ సాధించిన `జిగర్తాండ` చిత్రానికి రీమేక్ గా వాల్మీకి చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఇందులో తమిళ హీరో అధర్వ ఒక ఇంపార్టెంట్ క్యారక్టర్ లో కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డేని తీసుకున్నారని సమాచారం. ఒరిజినల్ లో లక్ష్మీమీనన్ నటించింది. ఆ క్యారక్టర్ తెలుగులో ఇప్పుడు పూజా హెగ్డే చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం 20 రోజలు తన డేట్స్ కేటాయించినట్లు తాజా సమాచారం అందుతోంది. 14 రీల్స్ బేనర్ పై రూపొందుతోందీ చిత్రం. దేవి శ్రీ సంగీత సారథ్యంలో ఇప్పటికే రెండు పాటలు కూడా కంపోజ్ జరిగినట్లు సమాచారం. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన డీజే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. మరో సారి ఈ సినిమాలో నటిస్తోంది. ఆమె నటించిన మహర్షి 9న విడుదల కానుంది.






