ఇది గూగుల్ మాట.. అనుష్క శర్మ అఫ్ఘన్ క్రికెటర్ రషీద్ ఖాన్ భార్య అంట!
on Oct 12, 2020

అనుష్క శర్మ ఎవరో మనందరికీ తెలుసు. కానీ గూగుల్ తల్లికే ఇంకా తెలీలేదు. ఏంటీ.. నిజమేనా! అని ఆశ్చర్యపోతున్నారా? అవును. బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క నేటి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనే విషయం తెలిసిందేగా. కానీ గూగల్ సెర్చ్ ఇంజన్ మాత్రం ఇటీవల అఫ్ఘానిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ వైఫ్ అని చూపిస్తోంది. దీనికి కారణం ఒకటి తగలడింది లెండి. కొంత కాలం క్రితం మీ ఫేవరేట్ తారలెవరని రషీద్‌ను అడిగితే.. అనుష్క శర్మ, ప్రీతీ జింటాల పేర్లు చెప్పాడు. దాంతో ఇప్పుడు నాకు తెలీని సమాచారం ఈ లోకంలోనే లేదని చెప్పుకొనే గూగుల్ సెర్చ్ అతని భార్యగా అనుష్క శర్మ పేరు చూపిస్తోంది. 2017 డిసెంబర్‌లో ఆ ఇద్దరికీ పెళ్లయినట్లు తెలియజేస్తోంది. నిజానికి రషీద్‌కు ఇంకా పెళ్లి కాలేదు.

2017 డిసెంబర్‌లో అనుష్క, విరాట్ కోహ్లీ పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే తాము తల్లిదండ్రులం కాబోతున్నామని ఆ జంట ప్రకటించింది. ప్రెగ్నెంట్‌గా ఉన్న తన ఫొటోలను అనుష్క శర్మ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది కూడా. వచ్చే ఏడాది ఆమె బిడ్డను కనబోతోంది. ఈ లాక్‌డౌన్ టైమ్‌లో ఇంట్లో తాము చేస్తున్న పనులకు సంబంధించిన పిక్చర్లు, వీడియోలను విరాట్, అనుష్క సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ, తమ ఫ్యాన్స్‌కు ఆనందం, వినోదం రెండు కలిగిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



