స్టార్ హీరో మూవీ సెట్లో భారీ అగ్ని ప్రమాదం!
on Apr 21, 2025
కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఇడ్లీ కడై' (Idly Kadai). తమిళనాడులోని తేని జిల్లా అనుప్పపట్టి గ్రామంలో షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ మూవీ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షూట్ కోసం వేసిన సెట్ లు దగ్దమయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ధనుష్ హీరోగా, దర్శకుడిగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. జాబిలమ్మ నీకు అంత కోపమా(నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం) తర్వాత ధనుష్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ 'ఇడ్లీ కడై'. వుండర్‌బార్ ఫిల్మ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్స్ లో రూపొందుతుండగా ధనుష్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ధనుష్, నిత్య మీనన్ జంటగా నటిసున్న ఈ చిత్రం, అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
