కోడి రామకృష్ణ కన్నుమూత!!
on Feb 22, 2019

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్ను మూశారు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన.. శుక్రవారం మధ్యాహ్నం తనువు చాలించారు. ఆయన మృతితో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఫాంటాసి చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన శైలి భిన్నమని అమ్మోరు, దేవి, అరుంధతి లాంటి సినిమాలను చూస్తే తెలుస్తుంది. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమయ్యారు. పాలకొల్లులో నరసింహా మూర్తి, చిట్టెమ్మ దంపతులకు జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య పాలకొల్లులో జరిగింది. డిగ్రీ పూర్తయ్యాక సినిమాల్లోకి వచ్చి ప్రయత్నాలు ప్రారంభించారు. దాసరి `తాత మనవడు` సినిమా చూసి ఇన్ స్పైర్ అయినా కోడి రామకృష్ణ ఆయన దగ్గర శిష్యరికం చేయాలని పట్టుబట్టి మరి ఆయన దగ్గర చేరారు. ఆయనకు ప్రియశిష్యుడుగా మారారు. దాసరిని దర్శకుడుగా పరిచయం చేసిన నిర్మాత రాఘవగారే `ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య` సినిమాతో టాలీవుడ్‌కు దర్శకుడిగా కోడిరామకృష్ణను దర్శకుడిగా పరిచయం చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



