ఫేమస్ మరుగుజ్జు నటుడు మృతి!
on Apr 18, 2021

'ది ఆడమ్స్ ఫ్యామిలీ' అనే టీవీ సిరీస్ ద్వారా పాపులర్ అయి, అనంతర కాలంలో పలు హాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు ఫెలిక్స్ సిల్లా మృతి చెందారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. పేన్‌క్రియాటిక్ కేన్సర్‌తో కొంత కాలంగా పోరాడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు సిల్లా తోటి నటుడు గిల్ గెరార్డ్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా చేసిన పోస్ట్‌లో వెల్లడించారు.
నాలుగడుగుల లోపు ఎత్తుండే సిల్లా 'ది ఆడమ్స్ ఫ్యామిలీ'లో "కజిన్ ఇట్" క్యారెక్టర్‌తో వీక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నారు. ఏబీసీలో అది 1964 నుంచి 1966 దాకా ప్రసారమైంది. ఇటలీలోని రోకాస్‌కాజలే అనే ప్రాంతంలో 1937 జనవరి 11న ఫెలిక్స్ సిల్లా జన్మించారు. 1955లో యు.ఎస్.కు తొలిసారి వచ్చిన ఆయన ఏడేళ్ల పాటు రింగ్లింగ్ బ్రదర్స్, బర్నమ్ అండ్ బెయిలీ సర్కస్‌లో పనిచేశారు. వాటిలో జోకర్‌గా, హార్స్ రైడర్‌గా ఆయన కనిపించేవారు.

1962లో ఒక స్టంట్‌మన్‌గా ఆయన హాలీవుడ్‌లో సెటిల్ అయ్యారు. ఆయనకు మరుగుజ్జు రూపం నటుడిగా అవకాశాలు తీసుకువచ్చింది. బ్యాట్‌మన్ రిటర్న్స్, స్పేస్‌బాల్స్, స్టార్ ట్రెక్ (టీవీ సిరీస్), స్టార్ వార్స్, మీట్ బాల్స్ పార్ట్ 2, ద బ్రూడ్, బక్స్ రోజర్స్ ఇన్ ద 25 సెంచరీ, డెమన్ సీడ్ లాంటి సినిమాల్లో ఆయన నటించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



