Home

»

Latest News

నాని చెప్పిందే జరిగింది. ‘ది ప్యారడైజ్’ మూవీకి ‘ఎ’ సర్టిఫికెట్.. రన్ టైమ్ ఎంతో తెలుసా.?

Sep 21, 2026 6:36PM

నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్‌’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. భారీ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ వస్తుందని గతంలో నాని చెప్పిన మాటలు నిజమయ్యాయి.

‘ది ప్యారడైజ్‌’ సినిమా దాదాపు మూడు గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెన్సార్ వివరాల ప్రకారం ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 54 నిమిషాల 4 సెకన్లుగా ఖరారు చేశారు. సినిమాలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డు పలు మార్పులు, కట్స్ సూచించినట్టు తెలుస్తోంది. మొత్తంగా 21 చోట్ల మార్పులు చేయాలని సీబీఎఫ్‌సీ సూచించినట్టు సమాచారం.

ఇది కూడా చదవండి: 80 మంది హీరోయిన్లతో ఎఎన్నార్ నటించినా.. సావిత్రి విషయంలో అన్నపూర్ణ అలా ఎందుకన్నారు?

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ.. ‘ది ప్యారడైజ్‌’ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ రావచ్చని ముందే ఊహించినట్లు చెప్పారు. ఈ సినిమా పిల్లలు, కుటుంబ ప్రేక్షకుల కోసం కాదని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే అన్ని రకాల జానర్లలో సినిమాలు చేయాలన్నదే తన ఉద్దేశమని, భవిష్యత్తులో కుటుంబ కథా చిత్రాల్లోనూ నటిస్తానని నాని తెలిపారు.

తాజాగా సెన్సార్ పూర్తయిన విషయాన్ని చిత్రబృందం ఓ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. సినిమాలో భావోద్వేగాలు అందరికీ నచ్చేలా ఉన్నప్పటికీ.. హింస, క్రూరత్వంతో కూడిన సన్నివేశాలు మాత్రం పెద్దలకు మాత్రమే అనే విషయాన్ని ఆ పోస్టర్ ద్వారా తెలియజేశారు. దీంతో సినిమాలో యాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది.

‘ది ప్యారడైజ్‌’లో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించారు. సీనియర్ నటుడు మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘ది ప్యారడైజ్‌’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ‘ఏ’ సర్టిఫికెట్ రావడంతో సినిమాలోని యాక్షన్, హింసాత్మక సన్నివేశాలపై మరింత ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్ 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చుతుంది: ఫోటో రచ్చ.. సిస్టమ్‌పై నీతులు చెప్పి, ఇప్పుడిలాంటి లా?ఫోటో

శంకర్ కాంబినేషన్‌లో రెండు సినిమాలు, నో చెప్పిన మహేష్.. రీజన్ ఏంటి? 

 

 

[The Paradise Movie, The Paradise Nani, Nani The Paradise, The Paradise A Certificate, The Paradise Censor Certificate, Nani Movies, Srikanth Odela, The Paradise Release Date, Anirudh Ravichander, Mohan Babu, The Paradise Telugu Movie, Nani Upcoming Movie]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com