Home

»

Latest News

వామ్మో.. ఈ నగరానికి ఏమైంది సీక్వెల్.. నెట్ ఫ్లిక్స్ ఎన్ని కోట్లకి కొనుక్కుందో తెలుసా?

Nov 9, 2026 2:53PM


2018 లో సెల్యులాయిడ్ పై అడుగుపెట్టిన' ఈ నగరానికి ఏమైంది' సాధించిన ఘన విజయం తెలిసిందే. కల్ట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అందుకే ఈ నెల 19 న రాబోతున్న సీక్వెల్  'ENE రిపీట్' పై  భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ అంచనాలని రెట్టింపు చేసేలా నెట్ ఫ్లిక్స్ డీల్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది


ENE రిపీట్ ని నెట్ ఫ్లిక్స్ దాదాపు 11 కోట్లకి  ఓటీటీ హక్కులు దక్కించుకుంది. అయితే ఇది బేసిక్ ప్రైస్ మాత్రమే. సినిమాలు హిట్ అయి భారీ కలెక్షన్స్ సాధిస్తే ఓటీటీలు ఇంకా ఎక్కువ అమౌంట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అలా ENE రిపీట్ కి కూడా నెట్ ఫ్లిక్స్ ఆఫర్ చేసారంట. 50 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే డబల్ అమౌంట్ అంటే 22 కోట్లు ఓటీటీ నుంచి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారంట.

ఈ నగరానికి ఏమైంది హిట్ అయినా తర్వాత కూడా యూత్ కి బాగా కనెక్ట్ అయి క్లాసిక్ గా నిలిచింది. దాంతో సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు ఈ సినిమా ఓటీటీ హక్కులు కొనుక్కున్నట్టుగా కూడా సినీ సర్కిల్స్ టాక్.

మొదటి భాగంలో విశ్వక్‌సేన్‌, అభినవ్‌ గోమటం, వెంకటేష్‌ కాకుమాను పోషించిన  క్యారెక్టర్స్ ఎంతలా నవ్వులు పంచాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు అదే నవ్వుల గ్యాంగ్‌తో పాటు శ్రీనాథ్‌ మాగంటి కూడా ఈ సీక్వెల్‌లో జతకలిసి థియేటర్లలో నవ్వుల సునామీ సృష్టించడానికి సిద్ధమయ్యారు. 

ఇది కూడా చదవండి: బొమ్మ ఎందుకు హిట్ అయ్యిందో తెలుసా: ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నిజం!

 

వివేక్‌ సాగర్‌ అందించిన మ్యూజిక్, ఇప్పటికే విడుదలై ట్రెండ్ అవుతున్న ట్రైలర్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేశాయి. కాసేపటి క్రితం విడుదలైన 'మిత్వా' సాంగ్ అభిమానులని ఆకట్టుకుంటూ ఉంది. తరుణ్ భాస్కర్ దర్శకుడు.

మీకు నచ్చవచ్చు: రామాయణపై వర్మ వ్యాఖ్యలు వైరల్: అసలు వర్మని ఇప్పుడేం చెయ్యాలి!
మీకు నచ్చవచ్చు:దీపావళి వేళ: ఆపరేషన్ తో చిన్నారి జీవితంలో వెలుగులు నింపిన సోను సూద్!

 

[Ee Nagaraniki Emaindi Sequel Ott Rights Sold For Netflix,  Ene repeat ott rights huge Price, ENE Repeat OTT rights, Ee Nagaraniki Emaindi sequel, Tollywood, Tollywood News, Telugu Cinema, Telugu Cinema News]
 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com