Home

»

Latest News

థియేటర్లలో భారీ బడ్జెట్ సినిమాల యాడ్స్: చిన్న సినిమాల ఫలితాన్ని మార్చేస్తున్నాయా?

Nov 9, 2026 3:28PM


 మీడియం లేదా కొంచం బడా సినిమా నచ్చి మూవీ చూడటానికి థియేటర్ కి వెళ్ళాం. సినిమా స్టార్ట్ అవ్వడం నుంచే సినిమా ఎలా ఉండబోతుంది, ఏ క్యారక్టర్ మనల్ని మెస్మారైజ్ చేయబోతోందనే క్యూరియాసిటీ ఉంటుంది.

కానీ సినిమా స్టార్టింగ్ ముందో, ఇంటర్వెల్ తర్వాతనో అత్యంత క్యూరియాసిటీ కలిగి ఉన్న బిగ్ పాన్ ఇండియా మూవీ ట్రైలర్ లేదా, టీజర్ ప్రత్యక్షమయితే. ఇప్పుడు ఈ విషయంపైనే సోషల్ మీడియా వేదికగా, ఫిలిం నగర్ సర్కిల్స్ వేదికగా చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చల మ్యాటర్ ఏంటో చూద్దాం.  

ఇటీవలి కాలంలో భారతీయ సినీ పరిశ్రమలో బడ్జెట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. పేర్లు అప్రస్తుతం. ఎందుకంటే ఆ లిస్ట్ మొత్తం సినీ ప్రేమికులు, ప్రేక్షకుల మస్తిష్కాల్లో భద్రంగా దాగి ఉంది. అయితే ఇక్కడే అసలు వివాదం మరియు బాక్సాఫీస్ ఎఫెక్ట్ మొదలవుతుంది. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ లో ఒక చిన్న, లేదా ఒక మాదిరి కమర్షియల్ బడా సినిమా షో ప్రారంభానికి ముందు దాదాపు 15 నుండి 22 నిమిషాల సుదీర్ఘ సమయం పాటు యాడ్స్ మరియు ట్రైలర్లు ప్రదర్శించడం ఆడియన్స్ మైండ్ సెట్ ను దెబ్బతీస్తోంది.

ఇది కూడా చదవండి: వామ్మో.. ఈ నగరానికి ఏమైంది సీక్వెల్.. నెట్ ఫ్లిక్స్ ఎన్ని కోట్లకి కొనుక్కుందో తెలుసా?

 ఇటీవలే హైదరాబాద్ కన్స్యూమర్ కోర్టు ఒక ప్రముఖ మల్టీప్లెక్స్ కి ఏకంగా 75,000 జరిమానా విధించడం ఈ సమస్య తీవ్రతకు నిదర్శనం. ఒక సామాన్య ప్రేక్షకుడు రూ. 1,500 నుండి 2,000 వరకు వెచ్చించి థియేటర్ కు వచ్చినప్పుడు, సినిమా చూస్తూ అనుభవిస్తున్న మూడ్ ను ఇంటర్వెల్ లో వచ్చే భారీ పాన్-ఇండియా యాడ్స్ ఒక్కసారిగా డిస్టర్బ్ చేస్తున్నాయి.

ప్రేక్షకుడు ప్రస్తుతం చూస్తున్న చిన్న లేదా మీడియం బడ్జెట్ చిత్రంలో ఉన్న ఎమోషన్ లో కొట్టుమిట్టాడుతుండగా, ఇంటర్వెల్ లో అకస్మాత్తుగా భారీ వీఎఫ్ఎక్స్, హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో నిండిన భారీ పాన్-ఇండియా టీజర్లు రావడం వల్ల సైకాలజికల్ గా సబ్‌కాన్షియస్ గా ఒక పోలిక (Comparison) ఏర్పడుతుంది. చిన్న సినిమా విజువల్స్ నిరాడంబరంగా అనిపించి, ప్రేక్షకుల దృక్కోణం (Audience Perspective) మారుతుంది. దీనివల్ల ప్రెజెంట్ చూస్తున్న సినిమా ఓవరాల్ రిజల్ట్ మరియు బాక్సాఫీస్ రేటింగ్ పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం 100% ఉందని ట్రేడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.

సినీ అభిమానులు అయితే అది పచ్చి నిజమని, ఒక మాదిరి సినిమాని కూడా ప్రేక్షకుడు  పాన్ ఇండియా మూడ్ లోకి వెళ్ళిపోయి డిజాస్టర్ టాక్ ని తనకి తెలియకుండానే చెప్తున్నాడు. అందుకే సినిమాల మధ్యలో ఏ ఇతర సినిమాల యాడ్స్ రాకూడదని వాళ్లంతా సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. 

 

మీకు నచ్చవచ్చు:ఆదిపురుష్ రికార్డు అవుట్ 
మీకు నచ్చవచ్చు: బొమ్మ ఎందుకు హిట్ అయ్యిందో తెలుసా: ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నిజం!

 

[Theater Interval Ads Impact On Small Movies, cinema advertising impact, pan india movie trailers, intermission theater ads, tollywood audience perspective, movie result analysis, Tollywood, Tollywood News, Telugu Cinema, Telugu Cinema News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com