దుల్కర్ సల్మాన్ ఇప్పుడు ‘లక్కీ భాస్కర్’
on Sep 25, 2023
రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా వుండే కథాంశాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేమైన ఇమేజ్‌ను ఏర్పరచుకుంటున్న హీరో దుల్కర్ సల్మాన్. మలయాళ హీరో అయినప్పటికీ కొన్ని విభిన్నమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు దుల్కర్.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘లక్కీ భాస్కర్’ అనే వెరైటీ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక మామూలు వ్యక్తి అసాధారణ ప్రయాణంతో ఉన్నత శిఖరాలను ఎలా చేరుకున్నాడనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందని దర్శకుడు వెంకీ అట్లూరి తెలిపారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
