ఫాదర్స్ డే స్పెషల్ గా `దృశ్యం 2`?
on Apr 12, 2021

విక్టరీ వెంకటేశ్ కి నటుడిగా మంచి గుర్తింపుని తీసుకువచ్చిన చిత్రాల్లో `దృశ్యం` ఒకటి. మాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ `దృశ్యం`కి రీమేక్ గా తెరకెక్కిన సదరు ఫ్యామిలీ థ్రిల్లర్ తో వెంకీ మంచి విజయాన్ని అందుకున్నారు. కుటుంబ రక్షణ కోసం ఎంత రిస్క్ అయినా తీసుకునే తండ్రి పాత్రలో వెంకీ కుటుంబ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.
కట్ చేస్తే.. ఇప్పుడా సినిమాకి సీక్వెల్ గా `దృశ్యం 2` రూపొందుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా రిలీజైన మాలీవుడ్ సెన్సేషన్ `దృశ్యం 2`కి రీమేక్ వెర్షన్ గా ఈ సీక్వెల్ తెరకెక్కుతోంది. వెంకీకి జోడీగా మీనా నటిస్తున్న ఈ సినిమాలో నరేశ్, నదియా, ఎస్తేర్ అనిల్, సంపత్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ నెలాఖరుకి చిత్రీకరణ పూర్తిచేసుకోనుందని సమాచారం.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఫాదర్స్ డే స్పెషల్ గా జూన్ 20న `దృశ్యం 2`ని రిలీజ్ చేయబోతున్నారట. అదే గనుక నిజమైతే.. ఈ సినిమా సబ్జెక్ట్ కి పర్ ఫెక్ట్ రిలీజ్ డేట్ ఇదేనని చెప్పాలి. కాకపోతే.. ఆదివారం రోజు సినిమాని రిలీజ్ చేస్తారా? లేదా? అన్నది కూడా ఆసక్తికరమే.
drushyam 2 released fathers day special, venkys drishyam 2 to be released on this special day,venkys drushyam 2
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



