
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ అవేటెడ్ పోలీస్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’ (Spirit) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకగా, తాజాగా చిత్ర యూనిట్ ఒక సాలిడ్ లొకేషన్‌లో సరికొత్త మేజర్ షెడ్యూల్‌ను ప్రారంభించింది.
హైదరాబాద్ లో అత్యంత ప్రసిద్ధ సింగిల్ స్క్రీన్ అయిన బాలానగర్‌లోని ఐకానిక్ ‘విమల్ థియేటర్’ లో స్పిరిట్ సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్ షురూ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ ఇటీవల కోట్లాది రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ నాలుగు దశాబ్దాల పాత థియేటర్‌ను పూర్తి అధునాతన 4K లేజర్ అండ్ డాల్బీ అట్మోస్ టెక్నాలజీతో రీమోడల్ చేయగా, ఇప్పుడు అదే విమల్ థియేటర్‌లో వంగా తన మార్క్ ఇంటెన్స్ యాక్షన్ సీన్స్‌ను ప్లాన్ చేయడం గమనార్హం.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా కోసం ఏకంగా 2 నెలల పాటు సాగే ఒక భారీ లాంగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేసి శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే సిటీలోని కొంపల్లి, అజీజ్ నగర్, కోటి ఉమెన్స్ కాలేజ్ వంటి విభిన్నమైన లొకేషన్లలో కీలక సన్నివేశాలను విజయవంతంగా పూర్తి చేసిన చిత్ర యూనిట్, ఇప్పుడు మాస్ క్రౌడ్ ఎక్కువగా ఉండే బాలానగర్ విమల్ థియేటర్ వద్ద ల్యాండ్ అయింది.
ఈ ఐకానిక్ థియేటర్ ప్రాంగణంలో సుమారు 2 రోజుల పాటు ఈ ప్రత్యేక షూటింగ్ షెడ్యూల్ జరగనుండగా, రెబల్ స్టార్ ప్రభాస్ స్వయంగా ఈ షూట్‌లో పాల్గొనబోతున్నారు. ఈ క్రేజీ న్యూస్ బయటకు రావడంతో ప్రభాస్‌ను చూసేందుకు థియేటర్ పరిసర ప్రాంతాలకు అభిమానులు భారీ సంఖ్యలో పోటెత్తారు.
సందీప్ రెడ్డి వంగా మార్క్ రా క్యారెక్టరైజేషన్‌తో ప్రభాస్ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా తన విశ్వరూపాన్ని చూపించబోతున్నారు. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, విలన్ పాత్రతో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నస్తున్నారు. 2027 మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.






