
ఎన్టీఆర్(Ntr)నుంచి వస్తున్న మరో సునామి 'డ్రాగన్'(Dragon)అనే విషయం గ్లింప్స్ రిలీజ్ తో క్లియర్ కట్ గా అర్ధమవుతుంది. ఫ్యాన్స్ అయితే సునామి కంటే ఎక్కువ అని చెప్తున్నారు. అందుకే తెలుగుతో పాటు పాన్ ఇండియా అన్ని భాషల్లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. తెలుగు సినిమాకి డ్రాగన్ అలనాటి వైభవాన్ని తీసుకురాబోతుందనే అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ డీటెయిల్స్ చూద్దాం.
పాత రోజుల్లో సినిమాకి సంబంధించిన ఆడియో క్యాసెట్స్ వచ్చేవి. అంటే వెండి తెరపై సినిమానే కాకుండా ఆడియో ద్వారా సినిమా వినడం. ఫ్యాన్స్ డిమాండ్ తో పాటు సినిమాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా మేకర్స్ సదరు ఆడియో క్యాసెట్స్ రిలీజ్ చేసే వారు. దాంతో మూవీ చూసాక కూడా మళ్ళీ ఆ చిత్రానికి సంబంధించిన కథ, డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ వింటూ ఆనందపడేవారు. ఇప్పుడు డ్రాగన్ గ్లింప్స్ చూస్తే కథ చెప్పిన విధానం గాని, డైలాగ్స్ గాని చాలా చక్కగా వివరంగా చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే అణుబాంబు విస్ఫోటనం జరిగేటప్పుడు వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందో, విస్ఫోటనం జరిగాక ఎంత దారుణంగా ఉంటుందో అర్థమైంది. డైలాగ్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. రిపీట్ గా డైలాగ్స్ కోసమే గ్లింప్స్ చూసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. దీంతో డ్రాగన్ రిలీజైన తర్వాత ఆడియో రావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తారేమో అనే మాటలు సోషల్ మీడియా వేదికగా వినపడుతున్నాయి.






