Home

»

Latest News

Bhagyashri borse: మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్న భాగ్యశ్రీ బోర్సే.. ఆ ఇద్దరికి విజయం లభిస్తుందా!

May 20, 2026

 


స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉన్న భామ భాగ్యశ్రీ బోర్సే. కానీ విజయం అనేది మాత్రం దక్కడం లేదు. అయినా కూడా వరుస క్రేజీ ఆఫర్స్ ని దక్కించుకుంటూ ముందుకెళ్తుంది.  

కమల్ హాసన్‌కి  చెందిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ 'రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్' ఆర్. మహేంద్రన్‌తో కలిసి నిర్మిస్తున్న భారీ యాక్షన్ రూరల్ డ్రామా 'సెయాన్'.ఈ చిత్రంలో  భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా ఎంపికైంది. ఇటీవల భాగ్యశ్రీ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో నెమలి పించం పట్టుకుని ఎంతో ప్రశాంతంగా, అందంగా కనిపిస్తున్న భాగ్యశ్రీ లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మురుగన్ (కార్తికేయ) దేవుడికి చిహ్నమైన నెమలి పించాన్ని చూపించడం ద్వారా ఈ సినిమాలో డివోషనల్ ఎలిమెంట్స్ కూడా బలంగా ఉంటాయనే హింట్ ఇచ్చారు మేకర్స్.

'తాయి కిళవి' ఫేమ్ దర్శకుడు శివకుమార్ మురుగేశన్  దర్శకత్వం వహిస్తున్నాడు. మధురై గ్రామీణ నేపథ్యంలో, అక్కడి సంప్రదాయ 'మాసి కలరి' పండుగ బ్యాక్‌డ్రాప్‌లో ఒక పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గారూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో శివకార్తికేయన్ ఒక ఆర్మీ సోల్జర్‌గా కనిపిస్తారని, ఆ తర్వాత ఊరి ప్రజల కోసం పోరాడే యాక్టివిస్ట్‌గా మారతారని కోలీవుడ్ వర్గాల సమాచారం. మ్యూజిక్ మేజిషియన్' సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా, వివేక్ విజయకుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Also read: Dragon: డ్రాగన్ గ్లింప్స్ పై రామ్ చరణ్ ఫ్యాన్స్ కామెంట్స్ 


శివకార్తికేయన్ గత చిత్రం పరాశక్తి బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకున్న నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్ ఆయనకు ఎంతో కీలకంగా మారింది. మరోవైపు భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం అక్కినేని అఖిల్ సరసన భారీ బడ్జెట్ చిత్రం 'లెనిన్' లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు భాగ్యశ్రీ కెరీర్‌ను మలుపు తిప్పుతాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. 'సెయాన్' ని  2026 అక్టోబర్ నెలలో దసరా కానుకగా భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com