విష్ణుకి సెన్సార్ కష్టాలు
on Oct 3, 2013

మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం "దూసుకేల్తా". వీరుపోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సెన్సార్ కష్టాలు మొదలయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లో "దొబ్బెయ్" అనే పదం ఉన్నందువల్ల ఈ చిత్రానికి "యూ" సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదని సెన్సార్ బోర్డు అధ్యక్షురాలు ధనలక్ష్మి అన్నారట. ఇది అన్యాయం అని హీరో విష్ణు నిలదీసినప్పటికి, ధనలక్ష్మి నుంచి ఎలాంటి సమాధానం రాలేదంట. దాంతో మొదటిసారిగా ఈ చిత్ర ట్రైలర్ ను రివ్యూ కమిటికి పంపించడం జరిగింది.మరి ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వబోతుందో మరి కొద్ది రోజుల్లోనే తెలియనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



