Home

»

Latest News

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ డిజాస్టర్ అయ్యిందా! రాజమౌళి, కార్తికేయ బ్రాండ్‌కి తగిలిన షాక్!

Oct 5, 2026 4:17PM

 

రిలీజ్ కి ముందు డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రమోషన్స్ చూసిన ఫ్యాన్స్, సినీ లవర్స్, ప్రేక్షకులు తమ రోజు వారి టైం టేబుల్ ని ఒక సారి చెక్ చేసుకొని ఉంటారు. ఎందుకంటే 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' కి వెళ్లాలని. అంతలా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ క్రేజ్ తెచ్చుకుంది. 

మరి రాజమౌళి  విజయంలోను, నిర్మాణ వ్యవహారాల్లోను వెన్నుముకగా నిలిచిన రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ సమర్పణలో ఎలాంటి సినిమా వచ్చినా, అందులో రాజమౌళి మార్కు ఎగ్జిక్యూషన్ మరియు గ్రాండియర్ ఖచ్చితంగా ఉంటాయని ప్రేక్షకులు బలంగా నమ్ముతారు.దీంతో కథలో ఏదో ఒక అద్భుతం ఉంటుందని భావించిన సాధారణ ప్రేక్షకుడు, థియేటర్లలో రెగ్యులర్ కథతో కూడిన నీరసమైన కథనాన్ని చూసి తీవ్ర నిరాశకి గురయ్యాడు. కార్తికేయ ప్రొడక్షన్ బ్రాండ్‌కు ఈ సినిమా ఎందుకు ఇంత పెద్ద షాక్ ఇచ్చిందంటే, ప్రధానంగా కథలోని లోతు లేకపోవడమే. సాధారణంగా రాజమౌళి లేదా కార్తికేయ ఎంచుకునే ప్రాజెక్టులలో డ్రామా, బలమైన క్యారెక్టర్స్, గ్రాఫిక్స్ పనితనం ఉన్నత స్థాయిలో ఉంటాయి. కానీ  నాణ్యత లేని విజువల్ ఎఫెక్ట్స్, స్క్రీన్ ప్లేలో నిరంతరం కనిపించే లాజిక్ లేని సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాయి. ఈ చిత్రం విడుదలైన తొలిరోజే కేవలం 30% కంటే తక్కువ ఆక్యుపెన్సీని నమోదు చేసింది.


ఇది కూడా చదవండి: The Paradise: 11 రోజుల కలెక్షన్ల ఊచకోత! ఎవరక్కడ! 

 

దాదాపు 25 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద కేవలం 4 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ కూడా రాబట్టలేకపోవడం సినీ వర్గాలని తీవ్రంగా ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రదర్శించబడిన థియేటర్లలో రెండవ రోజు నుంచే 60% వరకు షోలు రద్దవ్వడం లేదా ఖాళీగా దర్శనమివ్వడం దీని వైఫల్య తీవ్రతకు నిదర్శనం. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు సోషల్ మీడియా కామెంట్స్ గమనిస్తే, "రాజమౌళి, కార్తికేయ లాంటి విజనరీ లీడర్స్ నుంచి ఇటువంటి క్వాలిటీ లేని సబ్జెక్ట్‌ను అస్సలు ఊహించలేదు" అని ప్రేక్షకులు ఓపెన్‌గా కామెంట్స్ చేయడం కనిపించింది. అందుకే అంటారు కంటెంట్ ఉంటేనే ఎవరైనా కింగ్ అని. 

 

[Dont Trouble The Trouble Movie Failure Analysis, Dont Trouble The Trouble Movie Review, Rajamouli SS Kartikeya, Sharwanand Box Office Disaster, Telugu Cinema  News, Telugu cinema, Tollywood News, Tollywood]

 

 

 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com