నటసింహ నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ‘NBK 112’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో రూపొందించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా అధికారికంగా లాంచ్ కాగా.. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత కొరటాల ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.
ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. బాలయ్యకు ధీటుగా ఉండే మెయిన్ విలన్ పాత్ర కోసం సీనియర్ హీరో రాజశేఖర్‌ను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. కొరటాల శివ స్వయంగా రాజశేఖర్‌ను కలిసి కథతో పాటు ఆయన పాత్ర గురించి వివరించినట్లు, ఈ పాత్ర నచ్చడంతో ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఒకవేళ ఈ వార్త నిజమై రాజశేఖర్ సినిమాలో విలన్‌గా నటిస్తే మాత్రం బాలయ్య-రాజశేఖర్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారే అవకాశం ఉంది. ఇద్దరూ తమ కెరీర్‌లో యాంగ్రీ హీరోలుగా ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నవారే కావడంతో.. ఒకే సినిమాలో ప్రత్యర్థులుగా కనిపించడం ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా రాజశేఖర్‌ను ఇంతవరకు పూర్తి స్థాయి ప్రతినాయకుడి పాత్రలో చూడని ప్రేక్షకులకు ఇది కొత్త అనుభూతిగా మారొచ్చు.
మరోవైపు ఈ సినిమాలో బాలకృష్ణ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. కమర్షియల్ అంశాలతో పాటు సామాజిక సందేశాన్ని కలిపి కొరటాల శివ కథను సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే విలన్‌గా రాజశేఖర్ ఎంపిక, బాలయ్య ద్విపాత్రాభినయం వంటి అంశాలపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. నిజంగానే ఈ కాంబినేషన్ తెరపైకి వస్తే మాత్రం బాలయ్య వర్సెస్ రాజశేఖర్ పోరు సినిమాపై అంచనాలను మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.
[Balakrishna, Rajasekhar, Balakrishna Rajasekhar, NBK 112, NBK 112 Movie, Koratala Siva, Balayya Koratala Movie, Rajasekhar Villain, Balayya Villain, Tollywood News, Balakrishna Upcoming Movie]






