డీజే ఫస్టాఫ్ రివ్యూ
on Jun 23, 2017

హరీశ్ శంకర్ దర్శకత్వంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన డీజే( దువ్వాడ జగన్నాథమ్) ఇవాళ వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైంది. సరైనోడు లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా కావడం..ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో డైరెక్టర్ హరీశ్ శంకర్ పవర్‌ఫుల్ కథతో రంగంలోకి దిగడంతో డీజేపై భారీ అంచనాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షో పడి ఇంటర్వెల్ కావడంతో అభిమానులు సోషల్ మీడియా ద్వారా మూవీ అప్‌డేట్స్‌ను తమ ఫ్రెండ్స్‌తో పంచుకుంటున్నారు. ఈ ఎనాలసిస్‌లో ఫస్టాఫ్ చాలా స్లోగా నడిచిందట..దువ్వాడ జగన్నాథమ్ అనే వంటగాడిగా చిన్న చిన్న ఈవెంట్లు చేసుకుంటూ..పూజా హెగ్డేతో ప్రేమలో పడటం అంతా సరదా సరదాగా గడుస్తుందట..మొదటి గంట తర్వాత డీజే ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కథలో..కథనంలో వేగం మందగించిందట..డీజేకు దువ్వాడ జగన్నాథమ్‌కి సంబంధం ఏంటీ..? పూజా హెగ్డే ప్రేమ కథ ఎలా సాగుతుంది..సినిమా హిట్టా, ఫట్టా అన్నది తెలియాలంటే ఇంకొద్ది సేపు వెయిట్ చేస్తే సరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



