పవన్ భజన వెనుక..మాస్టర్ ప్లాన్ ఎవరిది?
on Jun 12, 2017

డీజే ఆడియో ఫంక్షన్‌లో.. హరీష్ శంకర్ రెచ్చిపోయాడు. పవన్ కల్యాణ్‌పై తనకున్న ప్రేమనంతా ప్రకటించేసుకొన్నాడు. ఓసారి పవన్ కల్యాణ్ ఫ్యాన్ అయితే.. కట్టె కాలేవరకూ ఆ అభిమానం అలానే ఉంటుందంటూ.. డీజే ఫంక్షన్ వచ్చిన పవన్ ఫ్యాన్స్‌నీ, టీవీలో చూస్తున్న అశేష అభిమానుల దృష్టినీ ఆకర్షించాడు. అయితే.. హరీష్ స్పీచ్ వెనుక ఓ మాస్టర్ మైండ్ ఉందని పవన్ ఫ్యాన్స్ ఉద్దేశం. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కీ, బన్నీ ఫ్యాన్స్‌కీ మధ్య దూరం పెరుగుతున్న తరుణంలో.. పవన్ ఫ్యాన్స్‌ని ఎలాగైనా సరే, కాస్త కూల్ చేయాలన్నది డీజే బృందం మాస్టర్ ప్లాన్. బన్నీ నోటి నుంచి ఎలాగూ పవన్ పేరు వినిపించదు. అందుకే ఆ బాధ్యతని పవన్ ఫ్యాన్ అయిన హరీష్ శంకర్ తీసుకొన్నాడు. డీజే ఆడియో ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించాల్సిన పని లేకున్నా - కావాలని, పని గట్టుకొని పవన్ ప్రస్తావన తీసుకొచ్చి.. `నేనూ మీ వాడినే` అనే కలరింగు ఇచ్చాడు. అయితే అల్లు అర్జున్ నోటి నుంచి ఒక్కసారి కూడా పవన్ పేరు బయటకు రాలేదు. కావాలనే ఆ పేరు పలకూడదని బన్నీ గట్టిగా డిసైడ్ అయ్యాడని మెగా కాంపౌండ్ వర్గాలు గుసగుసలాడుకొంటున్నాయి. బన్నీ ఎంత కంట్రోల్ అయినా, శిల్పకళావేదిక మొత్తం బన్నీ ఫ్యాన్స్‌తో నిండిపోయినా.. పవన్ పేరెత్తేసరికి అభిమానులు ఊగిపోయారు. ఆఖరికి గబ్బర్‌సింగ్ టైటిల్ గుర్తు చేసినా... అల్లాడించేశారు. పవన్ స్టామినా, కెపాసిటీ, క్రేజ్ అలాంటిది మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



