Home

»

Latest News

`రామారావు ఆన్ డ్యూటీ`.. రిపీట్ అవుతుందా!?

Jan 20, 2022 11:56AM

యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన `మ‌జిలీ` చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది దివ్యాంశ కౌశిక్. స‌మంత మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన స‌ద‌రు ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామాలో సెకండ్ హీరోయిన్ గా ద‌ర్శ‌న‌మిచ్చింది దివ్యాంశ‌. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే టాలీవుడ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్.

ఇదిలా ఉంటే.. స్వ‌ల్ప విరామం అనంత‌రం దివ్యాంశ కౌశిక్ మ‌రో తెలుగు చిత్రంలో సంద‌డి చేయ‌నుంది. ఆ సినిమానే.. `రామారావు ఆన్ డ్యూటీ`. మాస్ మ‌హారాజా ర‌వితేజ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ మూవీ కూడా ఇద్ద‌రు నాయిక‌ల‌కు స్థాన‌మున్న క‌థాంశంతోనే తెర‌కెక్కుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇందులో దివ్యాంశ‌తో పాటు `క‌ర్ణ‌న్`, `జై భీమ్` ఫేమ్ రాజీషా విజ‌య‌న్ మ‌రో హీరోయిన్ గా క‌నిపించ‌నుంది. కాగా, శ‌ర‌త్ మండ‌వ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్ష‌న్ డ్రామా.. వేస‌వి కానుక‌గా మార్చి 25న విడుద‌ల కానుంది. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. దివ్యాంశ తొలి తెలుగు చిత్రం `మ‌జిలీ` కూడా స‌మ్మ‌ర్ రిలీజ్ మూవీనే. మ‌రి.. `మ‌జిలీ`లాగే `రామారావు ఆన్ డ్యూటీ`తోనూ దివ్యాంశ కౌశిక్ స‌మ్మ‌ర్ సీజ‌న్ లో మ‌రో హిట్ అందుకుంటుందేమో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com