Home

»

Latest News

103 కేంద్రాలలో 'అఖండ' యాభై రోజుల జైత్ర‌యాత్ర‌!

Jan 20, 2022

 

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు తిరుగులేదని మరోసారి రుజువైంది. 'సింహ', 'లెజెండ్' సినిమాలతో బ్లాక్ బస్టర్స్ సాధించి ఇప్పుడు 'అఖండ' సినిమాతో హ్యాట్రిక్ హిట్ సాధించారు. 'సింహ', 'లెజెండ్‌' సినిమాలు అప్పటి వరకు బాలకృష్ణ కెరీర్ హయ్యస్ట్ కలెక్షన్లు సాధిస్తే.. ఇప్పుడు 'అఖండ' మ‌రింత భీక‌రంగా క‌లెక్ష‌న్లు వ‌సూలుచేస్తూ హయ్యస్ట్ గ్రాస్ సాధించి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

ప్రస్తుతం ఉన్న కాలంలో ఓ సినిమా యాభై రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడటం మామూలు విషయం కాదు. ఏకంగా 103 కేంద్రాలలో 'అఖండ' యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఇది అరుదైన ఫీట్. బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి 200 కోట్లు రాబట్టడం మ‌రో విశేషం.

Also read: జ‌గ‌న్ సాయం నా కుటుంబానికి అద్భుత‌శ‌క్తిని ఇచ్చింది!

ఈ మధ్య కాలంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిన చిత్రంగా 'అఖండ' నిలిచింది. ఓవర్సీస్‌లోనూ చిత్రం లాభాల బాట పట్టింది. యూకే, ఆస్ట్రేలియాలో సినిమాకు అద్బుతమైన రెస్పాన్స్ రాగా అమెరికాలో వన్ మిలియన్ డాలర్ మార్క్‌ను క్రాస్ చేసింది.

ఒమిక్రాన్ కేసులు పెరిగినా, పరిస్థితులు బాగా లేకపోయినా కూడా 'అఖండ' మాత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రతీ వారం కొత్త సినిమాలు వచ్చినా కూడా 'అఖండ' బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూనే వచ్చింది. ఏడో వారంలో కూడా మంచి వసూళ్లను రాబట్టింది.

Also read: సినిమా ఇండ‌స్ట్రీ క‌ష్టాల‌ను ఏపీలో వినిపించుకొనే నాథుడేడీ?

టీం అంతా కలిసి అద్భుతంగా పని చేయడం వల్లే ఈ స్థాయి విజయం దక్కింది. బోయపాటి కథ, మేకింగ్, యాక్షన్ ఎపిసోడ్స్, బాలయ్యను రెండు పాత్రల్లో డిఫరెంట్ షేడ్స్ లో చూపించిన విధానం ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది. ఇక తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సీ రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, ద్వారక ప్రొడక్షన్ నిర్మాణ విలువలు అన్నీ కలిసి సినిమాను బ్లాక్‌బస్టర్ చేశాయి.

ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించగా, శ్రీకాంత్, నితిన్ మెహ‌తా ప్రతినాయకులుగా కనిపించారు. జగపతిబాబు ఓ ముఖ్య పాత్రను పోషించారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com