బిగ్ బాస్ 4.. డైరెక్టర్ సూర్యకిరణ్ అవుట్!
on Sep 13, 2020
తెలుగు 'బిగ్ బాస్' 2020 నుండి ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్ గా దర్శకుడు సూర్యకిరణ్ నిలిచాడు. నాలుగో సీజన్ ఎలిమినేషన్ ఆదివారం రాత్రి అయిపోయింది. అందరూ ఊహించినట్లుగానే హీరోయిన్ కళ్యాణి అలియాస్ కావేరి హజ్బెండ్ సూర్యకిరణ్ షో నుండి బయటకు వచ్చేశాడు. సారీ... ఆయనను బయటకు పంపించేశారు.
మెహబూబ్, అఖిల్, దివి, సూర్యకిరణ్... ఆదివారం రాత్రికి నలుగురు ఎలిమినేషన్ జోన్లో ఉన్నారు. ముందుగా మెహబూబ్, అఖిల్ సేఫ్ జోన్ లో ఉన్నారని చెప్పిన నాగార్జున తర్వాత దివి కూడా సేఫ్ జోన్ లో ఉందని చెప్పాడు. చివరకు సూర్యకిరణ్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.
సూర్యకిరణ్ బయటకు వెళ్లేటప్పుడు మోనాల్ గజ్జర్ కన్నీళ్లు పెట్టుకుంది. షో మొదలైనప్పటి నుంచి అందరి పై ఆధిపత్యం చెలాయించాలని సూర్యకిరణ్ ప్రయత్నించడంతో అతడు ఎలిమినేట్ అవుతాడని వీక్షకులు ఊహించారు.
Also Read