సెంటిమెంట్ వదలని మారుతి!
on Dec 1, 2021
ఒక్కో దర్శకుడికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇంతకీ మారుతికి ఉన్న సెంటిమెంట్ ఏంటంటే.. అవకాశమున్నంత వరకు తన సినిమాలను ఫెస్టివల్ సీజన్స్ లోనే రిలీజ్ చేయడం. తొలి చిత్రం `ఈ రోజుల్లో` నుంచి గత చిత్రం `మంచి రోజులు వచ్చాయి` వరకు మారుతి డైరెక్టోరియల్స్ సింహభాగం అదే బాటలో పయనించాయి.
'సిరివెన్నెల'తో చివరిసారిగా మాట్లాడిన వ్యక్తిని నేనే!
2012 ఉగాదికి `ఈ రోజుల్లో`, అదే ఏడాది దీపావళికి `బస్ స్టాప్`.. 2017 విజయదశమికి `మహానుభావుడు`.. 2018 వినాయక చవితికి `శైలజారెడ్డి అల్లుడు`, 2019 క్రిస్మస్ సీజన్ లో `ప్రతి రోజూ పండగే`.. 2021 దీపావళికి `మంచి రోజులు వచ్చాయి`.. పండగల ప్రత్యేకంగానే విడుదలయ్యాయి. వీటిలో `శైలజా రెడ్డి అల్లుడు`, `మంచి రోజులు వచ్చాయి` మినహాయిస్తే మిగిలిన ఫెస్టివల్ రిలీజెస్ అన్నీ సక్సెస్ అయ్యాయి.
"సీతారాముడి సాహిత్యం నాతో శివతాండవం చేయించింది"..
కాగా, ప్రస్తుతం మ్యాచో స్టార్ గోపీచంద్, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా `పక్కా కమర్షియల్` అనే సినిమా చేస్తున్న మారుతి.. ఈ చిత్రాన్ని కూడా పండక్కే తీసుకురాబోతున్నారు. 2022 హోలి సందర్భంగా మార్చి 18న `పక్కా కమర్షియల్` సిల్వర్ స్క్రీన్ పైకి రానుంది. మొత్తమ్మీద.. మారుతి `ఫెస్టివల్ సెంటిమెంట్`ని బాగానే ఫాలో అవుతున్నాడన్నమాట.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
