షూటింగ్ కి ఆలస్యమవుతుందని లీగల్ నోటీసులు పంపించారు
on Feb 14, 2026

-ధనుష్ కి షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ
-నెక్స్ట్ ఏం జరగబోతుంది
-ధనుష్ నెక్స్ట్ సినిమా పరిస్థితి ఏంటి!
ధనుష్(Dhanush)కి ఉన్న సినీ ప్రొటాన్షియల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. తన స్వశక్తితో స్టార్ గా అవతరించాడు. సదరు స్టార్ ఇమేజ్ ని సైతం పక్కన పెట్టి 'డి' గ్లామర్ క్యారెక్టర్స్ చేస్తున్నా సరే, స్టార్ స్టేటస్ మాత్రం తనని వదిలి వెళ్లడం లేదు. అంతలా అభిమానులు, ప్రేక్షకులు ధనుష్ ని తమ నెత్తిన పెట్టుకుంటున్నారు. ప్రస్తుతంతో తన 55 వ చిత్రానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు. సాయి పల్లవి(Sai Pallavi),శ్రీలీల(Sreeleela)హీరోయిన్స్ గా చేస్తుండటంతో క్రేజీ ప్రాజెక్ట్ మారింది. రీసెంట్ గా ధనుష్ కి ఒక సినిమా లీగల్ నోటీసులు పంపించింది. ఆ వివరాలేంటో చూద్దాం.
నాన్ రుద్రన్.. 2016 వ సంవత్సరంలో తేనాండాల్ ఫిలిమ్స్ బ్యానర్ లో చెయ్యాల్సిన మూవీ..స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కించాలని భావించాడు. కారణాలు తెలియదు గాని దర్శకుడిగా ధనుష్ మారాడు. సదరు జరిగిన మొత్తం విషయంపై తేనాండాల్ ఫిలిమ్స్ స్పందిస్తూ దర్శకుడు మారడంతో ధనుష్ పూర్తి స్క్రిప్ట్ ని ఇవ్వడంలో జాప్యం చేస్తున్నాడు. షూటింగ్ కి కూడా హాజరు కావడం లేదు. దీంతో మాకు 20 కోట్ల రూపాయిలు నష్టం వచ్చింది. ఇతర చిత్రాలని మాత్రం అంగీకరిస్తున్నాడని చెప్తూ లీగల్ నోటీసులు పంపించింది. ఈ విషయంపై ఇంతవరకు ధనుష్ టీం నుంచి రెస్పాన్స్ రాలేదు.
Also read: Funki.. ఫంకీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! దీన్ని బట్టి హిట్టా! ప్లాపా!
తేనాండల్ ఫిల్మ్స్ కి తమిళ చిత్రపరిశ్రమలో సుదీర్ఘ చరిత్ర ఉంది. 1976లో నిర్మాణ రంగంలో ప్రవేశించి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలని నిర్మించిన ఘనత వాళ్ళ సొంతం. ఇళయ దళపతి విజయ్, అట్లీ ల 'మెర్సీ' మూవీ సదరు సంస్థ నుంచి వచ్చిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



