ఈ రాత్రికే దిల్ రాజు పెళ్లి
on May 10, 2020

కొద్ది వారాలుగా దిల్ రాజు రెండో పెళ్లి గురించిన ప్రచారం జరుగుతూ వస్తోంది. త్వరలోనే ఆయన పెళ్లి చేసుకోనున్నరనేది వాటి సారాంశం. అయితే ఇంతదాకా ఆయన ఈ విషయంపై పెదవి విప్పలేదు. ఆదివారం ఉదయం తను పెళ్లాడనున్నట్లు ధ్రువీకరించారు. తమ కుటుంబం కట్టించిన గుడిలోనే ఆదివారం రాత్రి నిజామాబాద్‌లో ఆయన వివాహం చేసుకోనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. లాక్‌డౌన్ అమల్లో ఉన్నందు వల్ల కేవలం పది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరగనున్నది.
తన వ్యక్తిగత జీవితం త్వరలోనే మంచికోసం మారనున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌లో దిల్ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. "ప్రపంచం స్తబ్దుగా ఉండి, వృత్తిపరంగా మనలో చాలా మందికి గొప్పగా గడవడం లేదు. కొంతకాలంగా వ్యక్తిగతంగానూ నా స్థితి గొప్పగా లేదు. అయితే అతి త్వరలో పరిస్థితులు చక్కబడతాయనీ, అందరూ బాగుంటారనీ ఆశిస్తున్నాను" అని ఆ పోస్ట్‌లో ఆయన తెలిపారు.
అలాగే, ఆ ఆశాభావంతోటే, కొత్త పార్శ్వాన్ని ప్రారంభించే సమయం, వ్యక్తిగత జీవితాన్ని తిరిగి ప్రారంభించాల్సిన సమయం వచ్చిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 2017లో ఆయన భార్య అనిత మృతి చెందారు. అప్పట్నుంచీ ఒంటరిగా ఉంటూ వస్తున్న ఆయన జీవితంలో ఇప్పుడు మరొకరు రానుండటం మంచి విషయమే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



