దిల్రాజు ఇంట్లో విషాదం..రాజు భార్య మృతి
on Mar 12, 2017
ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దిల్రాజు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన భార్య అనిత గుండెపోటుతో మరణించారు. గుండెపోటు వచ్చిన వెంటనే కుటుంబసభ్యులు ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ అనిత తుదిశ్వాస విడిచారు. అయితే ఈ సమయంలో దిల్రాజు హైదరాబాద్లో లేరు..వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఫిదా చిత్రం షూటింగ్ నిమిత్తం రాజు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన అమెరికా నుంచి హైదరాబాద్ బయలుదేరారు.