వైఎస్ జగన్‌తో దిల్ రాజు మీటింగ్..!
on Aug 7, 2023

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఓ వైపు సినిమాలు నిర్మిస్తూనే ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇది ఆయనకు కొత్త బాధ్యత. రీసెంట్‌గా జరిగిన ఛాంబర్ ఎన్నికలు చాలా రసవత్తరంగా జరిగాయి. దిల్ రాజు అధ్యక్షుడిగా ఎన్నిక కావటంలో అల్లు అరవింద్‌లాంటి పెద్దలు హస్తం ఉంది. సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా భారీగానే జరిగాయి. ఇప్పుడు దిల్ రాజు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసే పనిలో ఉన్నట్లు సమాచారం. మరీ ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌ను కలుస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. టికెట్ ధరల విషయంలో సమస్య వచ్చినప్పుడు మాత్రమే దిల్ రాజు సహా కొంత మంది నిర్మాతలు జగన్, సంబంధిత మంత్రులను కలిశారు.
టికెట్ ధర సమస్య పరిష్కారం తర్వాత సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు జగన్‌ను ఎవరూ కలవలేదు. బలమైన సందర్భం కూడా రాలేదనే చెప్పాలి. ఇప్పుడు దిల్ రాజు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఏపీ ప్రభుత్వం నుంచి సినీ ఇండస్ట్రీకి ఏం కావాలనే దానిపై కొంత మంది నిర్మాతలతో పాటు దిల్ రాజు వెళ్లి జగన్‌ను కలవబోతున్నారని టాక్. ఏపీ సీఎం అపాయింట్‌మెంట్ కోసం ఇప్పుడు దిల్ రాజు వెయిటింగ్‌లో ఉన్నారు. మరి దిల్ రాజుకి జగన్ సమయాన్ని కేటాయించి ఆయన సమస్యలను వింటారా? అనేది చూడాలి.
దిల్ రాజు ఈ ఏడాది తన వారసులతో దిల్ రాజు ప్రొడక్షన్స్‌ను స్టార్ట్ చేసి బలగం వంటి సినిమా చేసి భారీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బ్యానర్‌లో అందరూ కొత్త వారితో ఆకాశం దాటి వస్తావా అనే మరో సినిమాను రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



