'RC 15'కి ఊహించని టైటిల్.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!
on Mar 9, 2023

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'RC 15'(వర్కింగ్ టైటిల్). చరణ్ కెరీర్ లో 15వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న ఈ మూవీ నుంచి టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశముందని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మాత దిల్ రాజు కూడా ఇదే చెప్పారు. అలాగే మూవీ విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు 'RC 15' గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ టైటిల్ ని ఉగాదికి లేదా చరణ్ పుట్టినరోజుకి రివీల్ చేస్తామని తెలిపారు. 2024 సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ ఫిల్మ్ 'ప్రాజెక్ట్ కె' కూడా వచ్చే ఏడాది సంక్రాంతికే విడుదల కానుంది. ఈ లెక్కన 2024 సంక్రాంతి పోరు రసవత్తరంగా మారనుంది.
'RC 15'కి 'అధికారి', 'సిటిజన్', 'సర్కారోడు' వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు 'CEO' అనే మరో టైటిల్ తెరమీదకు వచ్చింది. ఈ టైటిల్ దాదాపు ఖరారు అయినట్లు న్యూస్ వినిపిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



