'ప్రేమమ్'కి, 'థాంక్యూ'కి తేడా ఇదే!
on Jul 18, 2022

అక్కినేని యువ హీరో నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ 'థాంక్యూ' జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా టీజర్, ట్రైలర్ గతంలో చైతన్య నటించిన 'ప్రేమమ్'తో పాటు, రవితేజ నటించిన 'నా ఆటోగ్రాఫ్' సినిమాలను గుర్తు చేస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఆ చిత్రాలకు, 'థాంక్యూ'కి చాలా తేడా ఉందని ప్రొడ్యూసర్ దిల్ రాజు అంటున్నారు.

'థాంక్యూ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన దిల్ రాజు.. కొందరు ఈ చిత్రాన్ని 'ప్రేమమ్', 'నా ఆటోగ్రాఫ్'తో పోలుస్తున్నారని, కానీ ఆ రెండు సినిమాలకు ఇది భిన్నంగా ఉంటుందని అన్నారు. అవి లవ్ స్టోరీలు కాగా, ఇది లైఫ్ స్టోరీ అని తెలిపారు. "మన జీవితంలో గొప్ప స్థాయికి చేరాక .. ఇదంతా మన విజయమే అనుకుంటాం. కానీ ఆ సక్సెస్ జర్నీకి చాలామంది సాయం ఉంటుంది. వాళ్లందరికీ థ్యాంక్స్ చెప్పే ఒక ఎమోషనల్ జర్నీనే ఈ కథ" అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు.
విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశి ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ తదితరులు నటించారు. బీవీఎస్ రవి కథ అందించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చగా, సినిమాటోగ్రాఫర్ గా పీసీ శ్రీరామ్ వ్యవహరించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



