స్పోర్ట్స్ మూవీ కోసం విక్రమ్ కొడుకు స్పెషల్ ట్రైనింగ్!
on Aug 4, 2023

తెలుగు, తమిళ చిత్రాల్లో విలక్షణమైన సినిమాలు, పాత్రల్లో నటిస్తూ నటుడిగా పాత్ర కోసం ఎలాంటి రిస్క్ అయినా చేయటానికి సిద్ధంగా ఉంటాడనే పేరు సంపాదించుకున్న కొద్ది మంది యాక్టర్స్‌లో చియాన్ విక్రమ్ ఒకరు. ఆయన సినిమాల్లోని పాత్రలను గమనిస్తే ఆయన డేడికేషన్ ఏంటో మనకు అర్థమైపోతుంటుంది. ఆయనే అలా ఉంటే నేనేం తక్కువ అని అంటున్నారు ఆయన కొడుకు యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్. తండ్రిని మించిపోతున్నాడు ధ్రువ్. సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు మరి. 2019లో హీరోగా సినీ రంగ ప్రవేశం చేసిన ధ్రువ్ ఇప్పటి వరకు కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించారు. ఇప్పుడు మూడో సినిమా సెట్స్ పైకి వెళ్లటానికి రెడీ అవుతోంది.
ధ్రువ్ విక్రమ్‌తో మూడో సినిమా చేస్తోన్న దర్శకుడు ఎవరో కాదు.. మారి సెల్వరాజ్. సమాజాన్ని పట్టి పీడిస్తోన్న కుల సమస్యలపై సినిమాలను తెరకెక్కించే ఈ దర్శకుడు ఈసారి ధ్రువ్‌తో సినిమా చేయబోతుండటం అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమా కోసం ధ్రువ్ కబడ్డీ ఆటను ప్రత్యేకంగా నేర్చుకుంటున్నారు. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న న్యూస్ ప్రకారం తమిళనాడుకి చెందిన ప్రముఖ కబడ్డీ ప్లేయర్ మానది గణేశన్ బయోపిక్‌నే మారి సెల్వరాజ్ తెరకెక్కించబోతున్నారట. సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది.
ఇంతకు ముందు పెరియేరుం పెరుమాల్, కర్ణన్, మామన్నన్ (తెలుగులో వడివేలు, ఉదయనిధి స్టాలిన్ నటించిన నాయకుడు) వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన మారి సెల్వరాజ్ సక్సెస్‌లను చవి చూశారు. ఇప్పుడు ధ్రువ్ విక్రమ్‌తో స్పోర్ట్స్ మూవీ చేస్తున్నారు. మరి ఈ సినిమాలో ఆయన ఏ సమస్యను ప్రస్తావిస్తారనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



