చిరంజీవి సాక్షిగా దేవిశ్రీప్రసాద్ కామెంట్స్.. పుష్పనే టార్గెట్ చేశాడా?
on Jun 23, 2025
టాలీవుడ్ లో మనసులో ఏదుంటే దానిని బయటకు మాట్లాడే వ్యక్తుల్లో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఒకరు. తన వర్క్ గురించి లేదా సినిమాకి సంబంధించిన ఏదైనా విషయంలో దర్శక నిర్మాతలు మాట్లాడిన మాటలు నచ్చకపోతే.. సినిమా వేదికపైనే వారికి నిరభ్యంతరంగా సమాధానమిస్తాడు. అలాంటి దేవిశ్రీప్రసాద్ తాజాగా రెమ్యూనరేషన్ గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన 'కుబేర' మూవీ జూన్ 20న విడుదలై.. మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం సక్సెస్ మీట్ నిర్వహించగా.. చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో దేవి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కుబేర నిర్మాత సునీల్ నారంగ్ గురించి మాట్లాడుతూ.. "ఆయన నా మొత్తం రెమ్యూనరేషన్.. సినిమా రిలీజ్ కి ముందే ఇచ్చేశారు. సినిమా బ్లాక్ బస్టర్ అయింది. టైంకి రెమ్యూనరేషన్ కూడా వచ్చేసింది. పైగా నా సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి అన్నారు. ఇంతకంటే ఏం కావాలి." అని చెప్పుకొచ్చాడు.
అంతేకాదు, సునీల్ నారంగ్ గారు స్టేజ్ మీద మాట్లాడితే చూడాలని ఉందని దేవి అన్నాడు. ఆ సమయంలో యాంకర్ మంజూష "సునీల్ గారు సక్సెస్ మీట్ లో మాట్లాడతా అని ప్రామిస్ చేశారు. మీరు మాట్లాడించాలి" అని చెప్పింది. ఆ మాటకి దేవి రియాక్ట్ అవుతూ.. "పేమెంట్ ఇస్తానని బాకీ పెట్టడం కంటే, మాట్లాడతానని బాకీ పెట్టడం మంచిదే" అని చెప్పాడు.
దేవి మాటలను బట్టి చూస్తే.. ఎవరో తన రెమ్యూనరేషన్ పెండింగ్ ఉంచారని అర్థమవుతోంది. అలాగే తన మ్యూజిక్ కూడా నచ్చలేదని చెప్పినట్టు అనిపిస్తోంది. పుష్ప-2 సమయంలో మైత్రి మూవీ మేకర్స్, దేవి మధ్య కాస్త గ్యాప్ ఉన్నట్టు అనిపించింది. మరి తాజాగా దేవి చేసిన కామెంట్స్ పరోక్షంగా వాళ్ళని టార్గెట్ చేసి అన్నాడా? లేక ఇంకెవరినైనా అన్నాడా? అనేది తెలియాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
