మహేశ్ డాన్సులు ఆడియెన్స్‌కు బోనస్!
on Jan 10, 2020
"మహేశ్ యాక్టింగ్ వేరే లెవెల్‌లో ఉండబోతుంది. నేను రీరికార్డింగ్ చేస్తున్నప్పుడే రిపీటెడ్‌గా చూశాను. ఈ సినిమాలో ఆయన డాన్సులు ఆడియన్స్‌కి బోనస్" అని చెప్పాడు దేవి శ్రీప్రసాద్. మహేశ్ హీరోగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' మూవీకి ఆయనిచ్చిన మ్యూజిక్ మంచి ఆదరణే పొందింది. ఆ సినిమా జనవరి 11న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "మహేశ్‌తో ఇది నా ఐదవ సినిమా. ఆయనతో జర్నీ చేయడం ఎప్పుడూ గొప్పగా ఉంటుంది. నేనెప్పుడూ చెప్తుంటాను 'మహేశ్ కేవలం సూపర్ స్టార్ మాత్రమే కాదు, ఒక సూపర్ స్టార్‌కి కావాల్సిన మంచి మనసు ఉంది' అని. ఎందుకంటే ఇప్పటివరకు ఆయనతో పనిచేసిన డైరెక్టర్స్ అందరితో నేను వర్క్ చేశాను. అందరూ కూడా ఒకే మాట అంటారు ఏంటంటే 'మహేశ్‌తో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలనుంది' అని. ఒకసారి కథ విని ఓకే అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఆయన టెక్నీషియన్శ్‌కి సపోర్ట్ చేస్తారు. కంప్లీట్‌గా డైరెక్టర్స్ యాక్టర్ ఆయన. అంత పెద్ద స్టార్ మనమీద నమ్మకం పెట్టినప్పుడు మనకు తెలియకుండానే పని మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. అందుకే అన్నీ బ్లాక్‌బస్టర్ మూవీస్ ఇవ్వగలిగాను. మహేశ్ బాబు సినిమాల్లో ఉండే సందేశం మిస్ కాకుండా, మహేష్ ఫ్యాన్స్ ఆయన్ని ఎంత ఎనర్జీగా చూడాలనుకుంటున్నారో ఈ రెండు పర్ఫెక్ట్ మిక్స్‌గా ఈ సినిమా వచ్చింది" అని తెలిపాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
