తెలంగాణ ముద్ర చెరిపేసుకునే ప్రయత్నంలో దేవరకొండ సోదరులు?
on Jul 11, 2020

'అర్జున్ రెడ్డి' ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా స్టార్ హీరో అయ్యాడు. అంతకుముందు హీరోగా తొలి సినిమా 'పెళ్లి చూపులు'తోనూ మంచి విజయం అందుకొన్నాడు. ముఖ్యంగా తెలంగాణ యాసలో అతను చెప్పే డైలాగులు మిగతా హీరోలకు కాస్త భిన్నంగా అతడిని నిలబెట్టాయి. 'దొరసాని' సినిమాతో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా అది. ప్రస్తుతం విజయ్ దేవరకొండను తెలంగాణ హీరోగా కొంత మంది చూస్తున్నారు.
తెలంగాణ ముద్ర ఆంధ్రాలో తమ సినిమా వసూళ్ల పై ప్రభావం చూపుతుంది అనుకున్నారో ఏమో... దాన్ని చెరిపేసుకునే ప్రయత్నం దేవరకొండ సోదరులు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
కాకినాడ నేపథ్యంలో విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' సినిమా చేశాడు. అందులో తెలంగాణ యాసలో కాకుండా తెలుగులో మామూలుగా మాట్లాడారు. 'గీత గోవిందం' సినిమా లోనూ తెలంగాణ యాస ఉండదు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ విషయానికి వస్తే... తెలంగాణ నేపథ్యంలో తొలి సినిమా చేసిన అతడు, ప్రస్తుతం గుంటూరు నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. భవ్య క్రియేషన్స్ పతాకంపై v ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ 'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు పరిచయమవుతున్నారు. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయింది.
తెలంగాణ ప్రేక్షకులతో పాటు అటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే ప్రయత్నం దేవరకొండ సోదరులు చేస్తుండడం అభినందనీయం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



