డ్రగ్స్ కేసు: లీగల్ టీమ్‌తో దీపిక డిస్కషన్?
on Sep 23, 2020

దీపికా పడుకోనే మరోసారి వార్తల్లో నిలిచింది. సినిమా కబుర్లు, ప్రేమ, పెళ్లి వంటి వార్తల్లో కాకుండా డ్రగ్స్ కేసులో ఆమె పేరు ప్రముఖంగా వినబడుతోంది. సుశాంత్ సూసైడ్ మిస్టరీగా మొదలైన కేసు... ఇప్పుడు డ్రగ్స్ కేసుగా మారింది. రియా చక్రవర్తి అరెస్ట్ తరవాత కథానాయికల పేర్లు ఈ కేసులో వినబడుతున్నాయి. దీపికా పడుకోనేకు త్వరలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సమన్లు జారీ చేయనుంది.
డ్రగ్స్ కేసు విషయమై ఢిల్లీలోని తన లీగల్ టీమ్‌తో దీపిక టచ్‌లోకి వెళ్లిందట. లీగల్‌గా ఎలా ప్రొసీడ్ అవ్వాలని డిస్కషన్లు ప్రారంభించింది. ప్రస్తుతం గోవాలో షకున్ బత్రా దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగులో పాల్గొంటోంది దీపిక. డ్రగ్స్ కేసులో తన పేరు రావడంతో త్వరలో గోవా నుండి ముంబై రావాలని ప్లాన్ చేసుకుంటోందని సమాచారం.
దీపికతో పాటు దియా మీర్జా పేరు కూడా డ్రగ్స్ కేసులో వచ్చింది. తానెప్పుడూ డ్రగ్స్ కొనడం గానీ, వాడటం గానీ చేయలేదని దియా మీర్జా క్లారిఫికేషన్ ఇచ్చారు. దీపిక మాత్రం ఇంకా స్పందించలేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



