దాసరికి అతనంటే అంత నమ్మకమా..?
on Sep 13, 2016

టాలీవుడ్‌లో దాసరి నారాయణరావు పాత్ర ప్రత్యేకమైనది. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా
తెలుగు తెరకు అద్భుతమైన సినిమాల్ని, ఎంతో మంది టెక్నీషియన్స్‌ని అందించారు దాసరి. ఒక పక్క దర్శకుడిగా ఉంటూనే
నిర్మాతగా చిత్రాల్ని సైతం నిర్మించారు. అయితే కొత్త దర్శకుల రాక, రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆయన సినిమాలపై దృష్టి సారించలేకపోయారు. అయితే ఉన్నట్టుండి తాను పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు దర్శకరత్న. దీనికి పవన్ వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇండస్ట్రీతో పాటు ఫ్యాన్స్ కూడా అవాక్కయ్యారు. ఇక్కడ దాసరితో సినిమా అంటే ఆయన దర్శకత్వంలో పవన్ నటిస్తాడని కాదు..కేవలం దాసరి సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తారట.
అంతా బాగానే ఉంది కాని దాసరిని మెప్పించి..పవన్‌ను టేక్ చేయగల ఆ దర్శకుడు ఎవరా అని అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తెర మీదకు రకరకాల పేర్లు వచ్చినప్పటికి అవన్నీ కేవలం పుకార్లేనని తేలిపోయింది. తాజాగా మరో దర్శకుడు లైమ్ లైట్‌లోకి వచ్చాడు. అతనేవ్వరో కాదు మిర్చి, శ్రీమంతుడు తాజాగా జనతా గ్యారేజ్ సినిమాతో మోస్ట్ వాంటేడ్ డైరెక్టర్‌గా మారిన కొరటాల శివ. ఇటీవల కొంతమందితో కొరటాలకు వర్తమానం పంపారట దాసరి. అదేంటంటే తాను నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాకి దర్శకత్వం వహించాలన్న ఆఫర్. ఈ ఆఫర్‌పై కొరటాల నుంచి ఇంకా స్పందన రాలేదు. ఇదంతా పక్కన బెడితే ఆ సినిమా పవన్, దాసరి సినిమా అని కొందరు.. కాదు దర్శకరత్న మరొకరితో చేసే సినిమా అని ఫిలింనగర్‌లో పుకార్లు వ్యాపిస్తున్నాయి. విషయం తెలియాలంటే కొరటాల గాని దాసరి గాని నోరు విప్పాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



