అల్లు వారబ్బాయ్ హీరో... దాసరి వారబ్బాయ్ విలన్?
on Sep 9, 2017
ఫేడ్ అవుట్ అయిన హీరోలు విలన్లుగా మారడం ఇప్పుడు సంప్రదాయంగా మారింది. జగపతిబాబు, శ్రీకాంత్ అలా వచ్చిన వారే కదా! త్వరలో మరో నటుడు విలన్ గా అవతారం ఎత్తనున్నాడని టాక్. అతనే.. దాసరి అరుణ్ కుమార్. దర్శకరత్న దాసరి నారాయణరావు తనయుడు అరుణ్... హీరోగా సక్సెస్ ని చవిచూడలేకపోవాడు. దాసరి ప్రయత్నాలు కూడా ఈ విషయంలో బెడిసికొట్టాయ్. హీరో పర్సనాలిటీ.. చక్కని రూపం ఉన్న అరుణ్ కి ఎలాగైనా సక్సెస్ ఫుల్ నటుడు కావాలనే కోరిక. ఆ కోరికను నిజం చేసుకోడానికి తాను విలన్ గా మారనున్నట్లు ఫిలింనగర్ సమాచారం. అల్లు శిరీష్ కథానాయకునిగా రూపొందుతోన్న ఓ చిత్రంలో ప్రధాన విలన్ గా తాను నటించనున్నట్లు తెలిసింది. మరి హీరోగా విజయాన్ని అందుకోలేకపోయిన అరుణ్... విలన్ గా అయినా సక్సెస్ చూస్తాడో లేదో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
