'దాస్ కా ధమ్కీ'కి ముహూర్తం ఫిక్స్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్!
on Mar 9, 2023

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'దాస్ కా ధమ్కీ'. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 17న విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. మార్చి 22న ఈ సినిమా విడుదలయ్యే అవకాశముందని న్యూస్ వినిపించాయి. తాజాగా మూవీ టీమ్ కూడా ఇదే తేదీని అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ ను విడుదల చేసింది.
'దాస్ కా ధమ్కీ' చిత్రాన్ని మార్చి 22న విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ పోస్టర్ ను వదిలారు. పోస్టర్ లో క్లాస్ గా, మాస్ గా రెండు భిన్న కోణాల్లో ఉన్న విశ్వక్ సేన్ లుక్స్ ఆకట్టుంటున్నాయి. దర్శకుడిగా ఇది విశ్వక్ సేన్ కి రెండో సినిమా. గతంలో 'ఫలక్‌నుమాదాస్'తో ఆకట్టుకున్న విశ్వక్.. ఈ సినిమాతో ఏస్థాయిలో మెప్పిస్తాడో చూడాలి. ఇక ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను మార్చి 17న నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానున్నారని సమాచారం.

వన్మయే క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి కరాటే రాజు నిర్మాత. నివేథ పేతురాజ్ హీరోయిన్ కాగా రావు రమేష్, తరుణ్ భాస్కర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ అందించిన ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



