మూటలు మోసిన రానా
on Feb 10, 2016
.jpg)
మొన్నీ మథ్యే రకుల్ ప్రీత్ సింగ్ కూరగాయలమ్మింది. అఖిల్ ఆటో నడపాడు. ఇప్పుడు రానా కూడా వీళ్లతో చేరాడు. కూలీలా వేషధారణ చేసి, రైతుబజార్లో మూటలు మోసి డబ్బు తీసుకున్నాడు. అలా తీసుకున్న డబ్బును ఛారిటీ కోసం, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం కోసం డొనేట్ చేస్తారట.
ఇదంతా దేనికి అని డౌట్ వచ్చిందా..? మంచు లక్ష్మి ప్రారంభించిన ' నేను సైతం ' అనే షో కోసమే ఇదంతా..ఒక బాలీవుడ్ షో స్ఫూర్తిగా తీసుకుని రూపొందించిన ఈ కొత్త కాన్సెప్ట్ జెమినీ టీవీలో టెలికాస్ట్ కానుంది.ఈ కాన్సెప్ట్ లో భాగంగా, తెలుగు సినీ తారలంతా కష్టపడి లేబర్ వర్క్ చేసి దాని ద్వారా వచ్చిన డబ్బును ఛారిటీ కోసం ఉపయోగిస్తారు. ఇలా తెలుగు తారలంతా, ప్రజలకు సాయం చేయడంలో తామెప్పుడూ ముందుంటామని మరో సారి ప్రూవ్ చేసుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



