అడవి శేషు డైలాగ్ హైలెట్..ఎవరు మోసం చెయ్యలేదు
on May 26, 2025

క్షణం, ఎవరు, గూఢచారి, మేజర్ వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోగా మారాడు అడవి శేషు(Adivi Sesh)ప్రస్తుతం 'డెకాయిట్'(Dacoit)ఒక ప్రేమ కథ అనే మూవీ చేస్తున్నాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్ గా చేస్తుండగా బాలీవుడ్ లెజండ్రీ డైరెక్టర్, యాక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రకాష్ రాజ్, సునీల్, జయన్ మారి ఖాన్, అతుల్ కులకర్ణి తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
రీసెంట్ గా ఈ చిత్రం నుంచి డెకాయిట్ ఫైర్ గ్లింప్స్ పేరుతో యాభై ఐదు సెకన్ల నిడివితో ఉన్న వీడియో విడుదలయ్యింది. ఈ వీడియోలో అడవి శేషు, మృణాల్, అనురాగ్ కశ్యప్ లని చూపించారు. పైగా వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఎలా ఉండబోతున్నాయో కూడా అర్ధమౌతుంది. జూలియట్ గా కనిపించబోతున్న మృణాల్ ని ఉద్దేశించి జూలియట్ నిన్ను అందరు మోసం చేసారు, నేను అందుకు రాలేదు అని అడవి శేషు చెప్పిన డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది,
క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న వరల్డ్ వైడ్ గా విడుదలవుతున్న'డెకాయిట్' కి షానీల్ డియో(Shaneil Deo)దర్శకత్వం వహిస్తుండగా ఎస్ ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ భీమ్స్ సిసిరోలియో దర్శకత్వం వహిస్తున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



