
నిన్న థియేటర్స్ లో అడుగుపెట్టిన డెకాయిట్
భారీగానే పోటెత్తిన అభిమానులు, ప్రేక్షకులు
మరి ఫస్ట్ డే వసూళ్లు ఎంత
అడివి శేష్(Adivi Sesh),మృణాల్ ఠాకూర్(Mrunal Thakur)నిన్న డెకాయిట్(Dacoit)తో వరల్డ్ వైడ్ గా విడుదలైన విషయం తెలిసిందే. చిత్రీకరణ దశ నుంచే భారీ అంచనాలని ఏర్పరుచుకోవడంతో అభిమానులు, ప్రేక్షకులతో థియేటర్స్ కళకళలాడాయి. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజవ్వగా చాలా చోట్ల ఆక్యుపెన్సి పరంగా కూడా నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఫుల్ అయినట్టుగా ట్రేడ్ వర్గాలు దృవీకరిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ ని చూద్దాం.
ఇండియాలో 7 .57 కోట్ల గ్రాస్, ఓవర్ సీస్ లో 6 కోట్లతో టోటల్ గా 13 .57 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా రాబట్టినట్టుగా తెలుస్తుంది. చిత్ర బృందం పదిహేను కోట్ల గ్రాస్ అని అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసింది. కొన్ని చోట్ల ముందు రోజు నైట్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఆ కలెక్షన్స్ ని ట్రేడ్ వర్గాలు పరిగణలోకి తీసుకోలేదేమో. ప్రస్తుతం మెజారిటీ రివ్యూస్ నెగిటివ్ గానే వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో టోటల్ లాంగ్ రన్ లో ఏ మేర కలెక్షన్స్ ని సాధిస్తుందనే ఆసక్తి ఉంది. సుమారు 40 కోట్ల బడ్జెట్ అనే టాక్ అయితే వినిపిస్తుంది.
Also Read: Ustaad bhagat singh: ఇక నో రూమర్స్.. ఉస్తాద్ భగత్ సింగ్ ఓటిటి డేట్ వచ్చేసింది
సుప్రియ యార్లగడ్డ నిర్మించగా షానియెల్(Shaneil Deo) దర్శకుడు. అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్ ముఖ్యమైన క్యారక్టర్ లో కనిపించారు. చిత్ర బృందం అయితే మూవీ సక్సెస్ అయ్యిందనే ధీమాని వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు సక్సెస్ సెలబ్రేషన్స్ ని నిర్వహించింది.





