Home

»

Latest News

పనివాడు కాదు,  నా ప్రాణ స్నేహితుడు.. వైరల్ అవుతున్న చిరంజీవి వీడియో!

Apr 11, 2026

- మెగాస్టార్ క్లాసిక్ టచ్

- సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో

- అప్పట్లోనే స్నేహం విలువ చెప్పిన మెగాస్టార్ 


మెగాస్టార్ చిరంజీవి, విజయ్ కుమార్, మీనా, కోట శ్రీ‌నివాస‌రావు, శ్రీ‌హ‌రి త‌దిత‌రులు న‌టించిన 'స్నేహం కోసం' చిత్రంలోని ఒక అద్భుత‌మైన ఎమోష‌న‌ల్ సీన్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇప్పుడీ వీడియోను చూసి అంద‌రూ ఎమోష‌న‌ల్ అవుతున్నారు. తన ప్రాణ స్నేహితుడు పనివాడి వేషంలో ఉండగా, అతడిని ఒక యజమానిగా కాకుండా మనస్ఫూర్తిగా తన ప్రాణానికి ప్రాణమైన మిత్రుడిగా స్వీకరించే భావోద్వేగపూరితమైన క్లిప్ ఇది.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్నేహం నేపథ్యంతో వచ్చిన చిత్రాలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'స్నేహం కోసం' ఒకటి. 1999లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ సినిమాలోని ఒక ఎమోషనల్ సీన్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ధనిక, పేద తారతమ్యం లేని స్వచ్ఛమైన స్నేహానికి ఈ సన్నివేశం ఒక నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది.

ఇంటికి వచ్చే అతిథి మరెవరో కాదు, తన ప్రాణ స్నేహితుడే అని తెలుసుకున్నప్పుడు ఆయన పడే ఆనందం మెగా అభిమానులనే కాక సామాన్య ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. "రేయ్ నువ్వు పనివాడివి కాదురా.. నా స్నేహితుడివి" అంటూ ఆయన చెప్పే డైలాగ్స్ స్నేహ బంధం విలువను చాటిచెబుతున్నాయి.

ఈ సన్నివేశంలో మెగాస్టార్ చిరంజీవి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. యజమాని ముందు వినయంగా వంగి దండం పెట్టే పనివాడిగా, ఆ తర్వాత తన స్నేహితుడు తనను సమానంగా గౌరవిస్తుంటే పొంగిపోయే భావోద్వేగాలను ఆయన కళ్ళలోనే పలికించారు. చిరంజీవి, విజయ్ కుమార్ మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా చిరంజీవిని 'ఒరేయ్' అని పిలవమని విజయ్ కుమార్ కోరడం, దానికి మెగాస్టార్ ఇచ్చే రియాక్షన్ హైలైట్‌గా నిలిచింది.

ప్రస్తుత కాలంలో స్వార్థం పెరిగిపోతున్న తరుణంలో, ఇలాంటి పాత సినిమాల క్లిప్పింగ్స్ చూస్తుంటే స్నేహం అంటే ఇదా అనిపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. "చిరంజీవి గారు ఎన్ని క్యారెక్టర్లు చేసినా, ఇలాంటి ఎమోషనల్ రోల్స్‌లో ఆయన మేనరిజమ్స్ వేరే లెవల్" అంటూ మెగా ఫ్యాన్స్ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. స్నేహానికి కులమతాలు, పేదరికం అడ్డుకాదని నిరూపించే ఈ సీన్ ఎప్పటికీ క్లాసిక్ అని చెప్పవచ్చు. ఇలాంటి అద్భుత‌మైన వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com