అప్పుడే ఓటీటీలోకి నాగ చైతన్య 'కస్టడీ'!
on Jun 7, 2023
అక్కినేని నాగ చైతన్య నటించిన రీసెంట్ మూవీ 'కస్టడీ'. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాపై చైతన్య ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. గతేడాది 'థాంక్యూ'తో నిరాశపరిచిన చైతన్య, ఈ సినిమాతో లెక్క సరిచేస్తాడని అక్కినేని అభిమానులు కూడా భావించారు. కానీ మే 12 న థియేటర్లలో విడుదలైన 'కస్టడీ' అంచనాలకు అందుకోలేక పరాజయం పాలైంది. ఇప్పుడు ఈ సినిమా నాలుగు వారాలకే ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.
'కస్టడీ' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని జూన్ 9 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ప్రైమ్ ప్రకటించింది. ఓటీటీలో తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. మరి థియేటర్లలో ఆదరణ పొందలేకపోయిన ఈ సినిమా.. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
