కూలీ ఓవర్ సీస్ బిజినెస్ ఇలా అయిపోతుందని ఎవరైనా ఊహించారా!
on Jul 3, 2025

మూడున్నర దశాబ్దాలపై నుంచే పాన్ ఇండియా స్టార్ గా తన సత్తా చాటుతూ వస్తున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth). ఆగస్టు 14 న 'కూలీ'(Coolie)అనే హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరో స్టార్ హీరో 'అక్కినేని నాగార్జున'(Akkineni Nagarjuna)విలన్ గా చేస్తుండటం, ఖైదీ, విక్రమ్, మాస్టర్,లియో చిత్రాల ఫేమ్' లోకేష్ కనగరాజ్'(Lokesh Kanagaraj)దర్శకత్వం వహించడంతో 'కూలీ' పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.
బిజినెస్ విషయంలో కూలీ సరికొత్త రికార్డులని నెలకొల్పుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తమిళ, తెలుగు భాషలకి సంబంధించి రజని కెరీర్ లోనే కనివిని ఎరుగని రేటుకి అమ్మినట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గా కూలీ ఓవర్సీస్ లో 80 కోట్లకి పైగానే బిజినెస్ జరుపుకుందనే టాక్ వినిపిస్తుంది. ఓవర్ సీస్ లో అంత భారీ రేటుకి బిజినెస్ జరిగిన ఫస్ట్ తమిళ మూవీ 'కూలీ' నే అనే మాటలు వినపడుతున్నాయి.
బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్(Amirkhan)గెస్ట్ రోల్ లో కనిపించనున్న ఈ మూవీలో శృతి హాసన్(Shruthi Haasan)ఉపేంద్ర, సౌభిన్ షాహిర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ 'పూజాహెగ్డే 'ప్రత్యేక గీతంలో అలరించబోతుంది. సన్ పిక్చర్స్ 'కూలీ' ని భారీ వ్యయంతో నిర్మిస్తుండగా అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రీసెంట్ గా 'చికుటు' అనే లిరిక్ తో కూడిన సాంగ్ రిలీజ్ అయ్యి రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



