పూజా హెగ్డే ఐటమ్ సాంగ్స్.. కామన్ పాయింట్స్ ఇవే!
on May 26, 2022

బుట్టబొమ్మ పూజా హెగ్డే ఖాతాలో ఐటమ్ సాంగ్స్ తక్కువే. అప్పుడెప్పుడో నాలుగేళ్ళ క్రితం `రంగస్థలం` (2018) కోసం ``జిల్ జిల్ జిగేల్ రాణి`` అంటూ ఊర మాస్ గా ఆడిపాడింది. కట్ చేస్తే.. మళ్ళీ ఇప్పుడు `ఎఫ్ 3` కోసం `` లైఫ్ అంటే ఇట్టా ఉండాలా`` అంటూ కాస్త క్లాస్ టచ్ తో చిందులేసింది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఇప్పటివరకు పూజ దర్శనమిచ్చిన ఈ రెండు స్పెషల్ సాంగ్స్ లో కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. వాటి వివరాల్లోకి వెళితే.. అటు `రంగస్థలం`కి, ఇటు `ఎఫ్ 3`కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ నే మ్యూజిక్ డైరెక్టర్. అలాగే, 2018 సమ్మర్ స్పెషల్ గా `రంగస్థలం` సందడి చేస్తే.. `ఎఫ్ 3` కూడా వేసవి బరిలోనే దిగుతోంది. అంతేకాదు.. `రంగస్థలం`లో కొణిదెల స్టార్ రామ్ చరణ్ తో కలిసి స్టెప్స్ వేసిన పూజ.. `ఎఫ్ 3`లోనూ కొణిదెల కాంపౌండ్ కి చెందిన వరుణ్ తేజ్ తో కాలు కదిపింది. మొత్తమ్మీద.. పూజా హెగ్డే చేసిన ఈ రెండు ఐటమ్ సాంగ్స్ లో కొన్ని పాయింట్స్ కామన్ గా ఉన్నాయన్నమాట. మరి.. 2018 సమ్మర్ సెన్సేషన్ గా నిలిచిన `రంగస్థలం`లాగే `ఎఫ్ 3` కూడా పూజా హెగ్డే కెరీర్ కి ప్లస్ అవుతుందేమో చూడాలి.
కాగా, విక్టరీ వెంకటేశ్ మెయిన్ హీరోగా నటించిన `ఎఫ్ 3` రేపు (మే 27) జనం ముందుకు రానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



