Home

»

Latest News

శ్రీకాంత్ "సేవకుడు" నిర్మాతపై ఛీటింగ్ కేస్

Apr 12, 2011 9:50AM

sevakudu wallpapers, sevakudu images, sevakudu stills, sevakudu pics, sevakudu photos, sevakudu picturesశ్రీకాంత్ "సేవకుడు" నిర్మాతపై ఛీటింగ్ కేస్ పెట్టబడిందని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీకాంత్ హీరోగా, ఛార్మి, విమలారామన్ హీరోయిన్లుగా "సేవకుడు" చిత్రాన్ని నిర్మిస్తున్న సుధాకర్ చిక్కడపల్లిలోని ఒక ఫైనాన్సియర్ విజయ శేఖర్ వద్ద నుంచి 40 లక్షలు అప్పు తీసుకున్నారు. ఆయన అప్పు తిరిగి చెల్లించనిదే "సేవకుడు" సినిమా విడుదల చేసుకోకూడదని అగ్రిమెంట్ కూడా వ్రాసుకున్నారట.

కానీ ఈ "సేవకుడు" నిర్మాత సుధాకర్, జెమిని కలర్ ల్యాబ్ వారు కలసి మరో ఫైనాన్సియర్ వద్ద నుంచి కూడా ఇలాంటి అగ్రిమెంటే వ్రాసుకుని మరో 65 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారట. ఈ విషయం తెలిసిన మొదటి ఫైనాన్సియర్ విజయ శేఖర్ నాంపల్లి మేట్రోపాలిటన్ లో కేసు వేయగా, మేజిస్ట్రేట్ ఆర్డర్ల ప్రకారం "సేవకుడు" నిర్మాతపై ఐపిసి సెక్షన్ 406, సెక్షన్ 420 ల ప్రకారం కేసులు నమోదు చేయబడ్డాయని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ సి.ఐ నర్సింగరావు మీడియాకు తెలియజేశారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com