సుధీర్ బాబు స్థానంలో మెగా అల్లుడు!!
on Nov 23, 2018

తొలి సినిమా విజేత తోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కళ్యాణ్ దేవ్ రెండో సినిమా ఖరారైంది.. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమా ని నిర్మిస్తుంది..నూతన దర్శకుడు పులి వాసు దర్శకత్వం వహిస్తున్నారు.. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తుండగా ఖుర్షీద్ (ఖుషి) సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. ఈ సినిమా లో రాజేంద్రప్రసాద్, నరేష్ వీకే, పోసాని కృష్ణ మురళి, ప్రగతి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు..త్వరలోనే మిగితా ఆర్టిస్టులు, టెక్నిషియన్ల వివరాలు తెలుపనున్నారు.
అయితే ఈ సినిమాను ఇది వరకే సుధీర్ బాబు హీరోగా రామానాయుడు స్టూడియోలో ప్రారంభించారు. కానీ షూటింగ్ జరుపుకోలేదు. మరి ఇంతలో ఏమైందో ఏమో కానీ, సుధీర్ బాబు ప్లేస్ లో మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాన్ దేవ్ వచ్చాడు. పులివాసు ని దాదాపు గా రెండేళ్లు తిప్పుకుని కథ పైనల్ చేసిన సుధీర్ బాబు మరి మధ్యలో ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పుకున్నాడో తెలియాల్సి ఉంది. `విజేత` సినిమా అంతగా ఆడకపోవడంతో కళ్యాన్ తేజ్ తో సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమలో చాలా కథలు కూడా విన్నాడట కళ్యాన్. పులి వాసు చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



